ఏపీపై ద్రోణి ప్రభావం.. భారీ వర్ష సూచన

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగింది..

Update: 2024-10-12 12:57 GMT

దిశ, వెబ్ డెస్క్: బంగాళాఖాతం(Bay of Bengal)లో ఉపరితల ఆవర్తనం కొనసాగింది. ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు వర్షాలు(Rains) కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ(Amaravati Meteorological Department) స్పష్టం చేసింది. ఈ నెలలోనే అరేబియా సముద్రంలో ఒకటి, బంగాళాఖాతంలో రెండు తుఫాన్లు ఏర్పడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. కోస్తా జిల్లాల(Coastal Districts)పై వీటి ప్రభావం ఉంటుందని, తద్వారా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించారు. వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్య్సకారులు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు. పిడుగుల సైతం పడే అవకాశం ఉందని, రైతులు, గొర్రెలకాపరులు చెట్ల కిందకు వెళ్లొద్దని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 


Similar News