AP News : ప్రభుత్వ గౌరవ సలహాదారుగా సుచిత్రా ఎల్లా

భారత్ బయోటెక్(Bharath Biotech) ఎండీ సుచిత్రా ఎల్లా(Suchitra Ella)కు మరో గౌరవం దక్కింది.

Update: 2025-03-19 16:44 GMT
AP News : ప్రభుత్వ గౌరవ సలహాదారుగా సుచిత్రా ఎల్లా
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్ : భారత్ బయోటెక్(Bharath Biotech) ఎండీ సుచిత్రా ఎల్లా(Suchitra Ella)కు మరో గౌరవం దక్కింది. సుచిత్రా ఎల్లాను ఏపీ ప్రభుత్వ గౌరవ సలహాదారు(AP Honorary Advisor)గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. ఈమేరకు ఏపీ సీఎస్ విజయానంద్(CS Vijayanand) బుధవారం ఆర్డర్స్ జారీ చేశారు. చేనేత, హస్తకళలకు సంబంధించిన గౌరవ అడ్వైజర్ గా, కేబినెట్ హోదాలో రెండేళ్లపాటు ఆమె ఈ హోదాలో కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అదే విధంగా ఏరో స్పేస్, డిఫెన్స్ మ్యాన్యుఫాక్చరింగ్ హబ్ గౌరవ అడ్వైజర్ గా డీఆర్డీవో మాజీ చీఫ్ జి. సతీష్ రెడ్డి(G. Sathish Reddy)ని ప్రభుత్వం నియమించింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను బుధవారం ఏపీ సీఎస్ విడుదల చేశారు.   

Tags:    

Similar News