AP:వరదలపై తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవు..ఏపీ పోలీసు శాఖ హెచ్చరిక

ఏపీలో వారం రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమైయ్యాయి.

Update: 2024-09-05 14:52 GMT

దిశ,వెబ్‌డెస్క్:ఏపీలో వారం రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాల(Heavy Rains) కారణంగా లోతట్టు ప్రాంతాలు(Inland areas) జలమయమైయ్యాయి. పంట పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. వేలాది ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. రహదారుల పై వరద నీరు చేరుకోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విజయవాడలో బుడమేరు(Budameru) ఉప్పొంగడంతో ఇళ్లలోకి వరద(Flood) నీరు చేరి ప్రజలు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఇళ్లల్లోకి వచ్చిన వరద నీటితో బురద పేరుకుపోయింది. ముంపునకు గురైన ప్రాంతాల్లో ఇళ్లను శుభ్రం(House Cleaning) చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది(Firefighters) తీవ్రంగా కృషి చేస్తున్నారు.

ఈ క్రమంలో సోషల్ మీడియాలో వరదల క్లీనింగ్ పై దుష్ప్రచారం జరుగుతోందంటూ తాజాగా ఏపీ పోలీస్ శాఖ పేర్కొంది. ‘విజయవాడలో నీట మునిగిన కాలనీలను శుభ్రం చేయడానికి వచ్చిన వాళ్లను కులం అడిగి చేయడం ఏంట్రా బాబు’ అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు ఏపీ పోలీస్ శాఖ తీవ్రంగా ఖండించింది. విపత్తు(disaster) సమయంలో తప్పుడు వార్తలు ప్రచారం చేయడం తీవ్ర నేరంగా పరిగణిస్తామని హెచ్చరించింది. కులాల మధ్య, ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించేలా వ్యవహరిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకునేది లేదని స్పష్టం చేసింది. వరద బీభత్సంతో(Panic) లక్షలాది మంది ప్రజలు బాధలు పడుతున్న వేళ ఇలాంటి ప్రచారం క్షమించరానిదని(Unforgivable) పోలీస్ శాఖ వెల్లడించింది.


Similar News