Breaking News: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం..మరో పథకం పేరు మార్పు..!

ఏపీలో కొత్తగా కొలువుదీరిన కూటమి ప్రభుత్వం(Andhra Pradesh Government) గత ప్రభుత్వ హయాంలో ఉన్న పథకాల పేర్ల మార్పు(Name Change) ప్రక్రియ కొనసాగుతూనే ఉంది.

Update: 2024-09-18 20:03 GMT

దిశ, వెబ్‌డెస్క్:ఏపీలో కొత్తగా కొలువుదీరిన కూటమి ప్రభుత్వం(Andhra Pradesh Government) గత ప్రభుత్వ హయాంలో ఉన్న పథకాల పేర్ల మార్పు(Name Change) ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. తాజాగా మరో స్కీమ్‌(scheme) పేరు మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.'వైఎస్సార్ లా నేస్తం(YSR Law Nestham)' పథకం పేరును 'న్యాయమిత్ర(Nyayamitra)'గా మారుస్తూ న్యాయశాఖ కార్యదర్శి(Legal Secretary) సునీత(Sunitha) జీవో జారీ చేశారు.ఈ స్కీమ్‌ కొత్త మార్గదర్శకాలను త్వరలోనే జారీ చేస్తామని సునీత తెలిపారు. కాగా యువ న్యాయవాదులకు ఆర్థిక ప్రోత్సాహం అందించేందుకు గత వైసీపీ(YCP) ప్రభుత్వం వైఎస్సార్‌ లా నేస్తం స్కీమ్‌ను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే.ఈ పథకం కింద లా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన యువ న్యాయవాదులకు గత ప్రభుత్వం నెలకు రూ.5 వేల స్టైఫండ్ అందించింది.

కూటమి ప్రభుత్వం ఇప్పటివరకు మార్పు చేసిన పథకాల పేర్ల ఇలా ఉన్నాయి..

జగనన్న విద్యా దీవెన, వసతి దీవెనల పథకాల పేర్లను ‘పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్’గా మార్చారు.ఎస్సీలకు అమలవుతున్న జగనన్న విద్యాదీవెన పథకం ‘అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి’గా.. వైఎస్సార్ కళ్యాణ మస్తు పేరును ‘చంద్రన్న పెళ్లి కానుక’గా.. వైఎస్సార్ విద్యోన్నతి పథకం పేరును ‘ఎన్టీఆర్ విద్యోన్నతి’గా మార్పు.. జగనన్న సివిల్‌ సర్వీసెస్‌ ప్రోత్సాహకం పేరును ‘సివిల్ సర్వీసెస్ పరీక్షల ప్రొత్సాహాకాలు’గా.. 'శాశ్వత భూ హక్కు-శాశ్వత భూ రక్ష' పథకం పేరును 'ఏపీ రీ సర్వే ప్రాజెక్ట్'గా మార్చింది కొత్త కూటమి ప్రభుత్వం.


Similar News