ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా సెలవులు ప్రకటించిన ప్రభుత్వం

రెండు తెలుగు రాష్ట్రాల్లో దసరా పండుగను(Dussehra festival) అంగరంగ వైభవంగా జరుపుకుంటారు.

Update: 2024-09-19 14:51 GMT

దిశ, వెబ్‌డెస్క్:రెండు తెలుగు రాష్ట్రాల్లో దసరా పండుగను(Dussehra festival) అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఈ క్రమంలో బతుకమ్మ పండుగ (Bathukamma festival) స్టార్టింగ్ రోజు నుంచే పాఠశాలలకు (School) ఫెస్టివల్ హాలిడేస్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇప్పటికే తెలంగాణలో స్కూళ్లకు దసరా సెలవులు ప్రకటించడంతో ఏపీలో ఎప్పట్నుంచి ఉంటాయనే చర్చ మొదలైంది. దీంతో తాజాగా ఏపీ విద్యాశాఖ దసరా సెలవులు ప్రకటించింది. ఈ నేపథ్యంలో అకడమిక్ క్యాలెండర్ ప్రకారం అక్టోబర్ 4వ తేదీ నుంచి సెలవులు (Holidays) ప్రారంభమై అక్టోబర్ 13తో ముగుస్తాయి. అక్టోబర్ 2వ తేదీన గాంధీ జయంతికి సెలవు కాగా.. 3వ తేదీన వర్కింగ్ డే గా ఉండనుంది. అయితే ఇటీవల ఏపీలో వర్షాలతో పలు జిల్లాల్లో 5 నుంచి 6 రోజుల పాటు స్కూళ్లకు సెలవు ఇవ్వడంతో దసరా హాలిడేస్ తగ్గించే అవకాశం ఉందని సమాచారం.


Similar News