దోపిడీ దొంగల అరెస్ట్.. ఒంటరి మహిళలే లక్ష్యంగా ఆభరణాల చోరీ

పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గ, బెల్లంకొండ మండలంలో పలు చోట్ల నగదు దోపిడీలు జరుగుతున్నాయి.

Update: 2024-09-19 15:24 GMT

దిశ,పెదకూరపాడు: పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గ, బెల్లంకొండ మండలంలో పలు చోట్ల నగదు దోపిడీలు జరుగుతున్నాయి. మధ్య రాత్రి సమయంలో దొంగలు మరణాయుధాలతో దాడి చేసి నగదు దోచుకెళ్తున్నారు. ఈ ఘటనపై పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రావు స్పందించి ఆదేశించారు. డీఎస్పీ హనుమంతరావు, సీఐపీ సురేష్ కేసు దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా 18వ తేదీన సాయంత్రం సమయంలో నేరానికి పాల్పడిన ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి విచారించారు. పోలీసుల వివరాల మేరకు ఉనల దావీదు, బత్తుల సిసింద్రీ, బండారు వీరబ్రహ్మం అనే వ్యక్తులు నాగిరెడ్డి పాలెంలో వృద్ధ మహిళను ఎరుకల కత్తితో దాడి చేశారన్నారు.

వృద్ధుడికి తీవ్ర గాయాలు చేసి, వృద్ధురాలి మెడలో రెండు పిటల బంగారు గొలుసు (25 గ్రాములు) దోచుకెళ్ళినట్లు తెలిపారు. అదేవిధంగా నేరానికి ఉపయోగించిన ఎరుకల కత్తి, బజాజ్ పల్సర్ బైక్, పోకో కంపెనీ స్మార్ట్ మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నామన్నారు. గతంలో కూడా నకరికల్లు మండలం, నరసింగపాడు గ్రామంలో ఒంటరిగా గేదెల మేపుకుంటున్న ఒక మహిళ వద్ద కత్తితో బెదిరించి మెడలోని బంగారు నాన్ త్రాడ్ కూడా స్వాధీన పరచుకోవడం అయిందని తెలిపారు. కేసును చేదించుటలో కృషి చేసిన పి.సురేష్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పెదకూరపాడు, హెడ్ కానిస్టేబుల్ రాజా, మూర్ల అంకమ్మరావు, షణ్ముఖరావు, బాలకృష్ణ రాజేషులను, సత్తెనపల్లి డీఎస్పీ హనుమంతరావు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.


Similar News