చేప నూనె, బీఫ్, పంది కొవ్వు నూనె తో తిరుపతి లడ్డు తయారీ.. ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ ఇదే

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుపతి లడ్డూ(Tirupati Laddu)లపై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

Update: 2024-09-19 13:33 GMT

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుపతి లడ్డూ(Tirupati Laddu)లపై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. వైసీపీ ప్రభుత్వం(YCP Govt) తిరుమల ప్రతిష్టను దిగజార్చేందుకు ప్రయత్నించిందని, దేవుడి ప్రసాదంలో నెయ్యి కాకుండా.. జంతువుల కళేబరాలతో తయారు చేసిన నూనెను ఉపయోగించారని..ఈ వ్యవహారంలో భారీగా అక్రమాలు జరిగాయిన సీఎం చెప్పుకొచ్చారు.

ఇదిలా ఉంటే కేంద్ర ప్రభుత్వం(Central Government)ద్వారా గుర్తింపు పొందిన ఓ ల్యాబ్ నివేదికలో సంచలన రహస్యాలు బయటపడ్డాయి. గత ప్రభుత్వ హయాంలో తిరుపతి లడ్డూల తయారీలో ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు(Animal fat) ఉన్నట్లు గుర్తించారు. జులై 8, 2024న ప్రసాదం శాంపిల్స్‌ని ల్యాబ్‌కు పంపించగా జులై 17న ఎన్డీ డీబీ CALF ల్యాబ్ నివేదిక ఇచ్చింది. ఈ నివేదికలో ఆవు నెయ్యిలో సోయాబీన్, పొద్దు తిరుగుడు, ఆలివ్, గోధుమ బీన్, మొక్కజొన్న, పత్తి గింజల తో పాటు చేప నూనె, బీఫ్ టాలో(Beef tallow), పామాయిల్, పంది కొవ్వు కూడా వాడినట్లు స్పష్టమైంది. కాగా ఈ వార్తలపై స్పందించిన మాజీ టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి.. తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

భారత దేశంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాల్లో ఒకటైన తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ తయారీలో చేప నూనె, బీఫ్ టాలో(Beef tallow), పామాయిల్, పంది కొవ్వుతో కూడిన నూనెను ఉపయోగించడం పై బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ట్విట్టర్ ద్వారా వీడియోను విడుదల చేసిన రాజా సింగ్.. ఆ వీడియోలు ఇలా మాట్లాడారు.."ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ పాలనలో పవిత్రమైన తిరుపతి లడ్డూ ప్రసాదంలో గొడ్డు మాంసం, చేప నూనె వినియోగిస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. ఇది మన సుసంపన్నమైన సాంస్కృతిక, మతపరమైన వారసత్వంపై ప్రత్యక్ష దాడి. దీనిని సహించ కూడదు. నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, భారత ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షాకు విన్నపం చేస్తున్నారు.. ఈ ఘోరమైన నేరానికి బాధ్యులైన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలి.

తిరుపతి, హిందువులకు అత్యంత పవిత్రమైన ప్రదేశాలలో ఒకటి, ఇక్కడ వేంకటేశ్వరుని ఆశీర్వాదం కోసం ఏటా కోట్లాది మంది భక్తులు సందర్శిస్తారు. గొడ్డు మాంసం, చేప నూనెతో ప్రసాదం అందించడం మన విశ్వాసాన్ని, మనోభావాలను అవమానించడమే. మనం ఐక్యంగా ఉండి మన పవిత్ర సంప్రదాయాలను దెబ్బతీయకుండా కాపాడుకోవాల్సిన సమయం ఆసన్నమైంది" అని ఎమ్మెల్యే రాజాసింగ్ చెప్పుకొచ్చారు.


Similar News