జమిలి ఎన్నికలు దేశానికి మంచివి కావు : ఎంపీ చామల కిరణ్​ కుమార్ రెడ్డి

దేశ వ్యాప్తంగా బీజేపీ డైవర్ట్ పాలిటిక్స్ కు తెర లేపిందని ఎంపీ చామల కిరణ్​ కుమార్ రెడ్డి వెల్లడించారు.

Update: 2024-09-19 17:32 GMT

దిశ; తెలంగాణ బ్యూరో : దేశ వ్యాప్తంగా బీజేపీ డైవర్ట్ పాలిటిక్స్ కు తెర లేపిందని ఎంపీ చామల కిరణ్​ కుమార్ రెడ్డి వెల్లడించారు. కాంగ్రెస్ మరింత బలపడుతుందనే భయంతో జమిలి ఎన్నికలు అంటూ హాడావిడి చేసిందన్నారు. జమిలి ఎన్నికలు ప్రాసెస్ మొదలు పెడితే 18 సవరణాలు చేయాల్సి ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. రామ్ నాథ్​ కోవింద్ రిపోర్టులో వాస్తవాలు లేవన్నారు. ఒకే సారి ఎన్నికలు మంచివి కాదన్నారు. గురువారం ఆయన గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడుతూ... ఒకే దేశం, ఒకే ఎన్నిక గురించి క్యాబినెట్ మీటింగ్ పెట్టి చర్చించే ముందు ప్రజలకు కూడ వాస్తవాలు తెలియజేయాలన్నారు. రామ్ నాథ్ కోవింద్ కమిటీ ఎప్పుడు, ఎవరిని ఎక్కడ మీటింగ్ పెట్టి మాట్లాడారో స్పష్టత ఇవ్వలేదన్నారు. ఈ రిపోర్టు అసంపూర్ణంగా ఉన్నదన్నారు. నిజానికి ఇప్పుడు 4 రాష్ట్రాల్లో ఒకేసారి ఎన్నికలు జరుపలేని పరిస్థితి ఉండగా, దేశ మంతా ఎలా సాధ్యమవుతుందో? ఆలోచించాలన్నారు. బీజేపీ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. లోక్ సభ, రాజ్యసభలో ఎంపీల మద్ధతు అవసరం అన్నారు. జమిలి అంటూ వినడానికి బాగానే ఉన్నా, చాలా సమస్యలు ఉన్నాయన్నారు. సిబ్బంది, అవసరమైన ఏర్పాట్లు, తదితర టెక్నికల్ సమస్యలు ఉంటాయన్నారు. బీజేపీ అభిప్రాయ సేకరణ తీసుకోకుండా సింగల్ ఏజెండగా నిర్ణయం తీసుకుంటుదన్నారు. గతంలో పెద్ద నోట్ల రద్దు కూడా ఇదే విధంగా జరిగిందన్నారు. దీని వలన ఎవరికి లాభం జరిగిందనేది అందరికీ తెలుసునని చెప్పారు. జమిలి ఎన్నికల పై ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. ప్రపంచంలో 194 దేశాలున్నాయని, కేవలం 10 దేశాల్లోనే జమిలి ఎన్నికలు నడుస్తున్నాయని వివరించారు. ఈ కార్యక్రమం లో టీపీసీసీ జనరల్ సెక్రెటరీ సత్తు మల్లేష్, మీడియా కోఆర్డినేటర్లు శ్రీకాంత్ యాదవ్, వచన్ కుమార్, స్పోక్స్ పర్సన్ సంధ్య, టీపీసీసీ నాయకులు వెంకటేష్ గౌడ్ పాల్గొన్నారు.


Similar News