AP News:‘పారదర్శకంగా ఉచిత ఇసుక బుకింగ్‌’.. సీఎం చంద్రబాబుకు చెప్పిన కలెక్టర్‌

ఏలూరు జిల్లాలో ఉచిత ఇసుకను పూర్తిగా పారదర్శకంగా అందించేందుకు ఆన్లైన్ ద్వారా బుక్‌ చేసేందుకు ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు తెలిపారు.

Update: 2024-09-19 13:38 GMT

దిశ, ఏలూరు: ఏలూరు జిల్లాలో ఉచిత ఇసుకను పూర్తిగా పారదర్శకంగా అందించేందుకు ఆన్లైన్ ద్వారా బుక్‌ చేసేందుకు ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు తెలిపారు. ఉచిత ఇసుక విధానంపై ఆన్లైన్ పోర్టల్‌ను అమరావతి నుంచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గురువారం సాయంత్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ఉచిత ఇసుక కోసం ప్రజలు ఆన్లైన్‌లో సులభతరంగా నమోదు చేసుకొనే ప్రక్రియను క్రమబద్ధమైన రీతిలో రూపొందించామన్నారు.

ఇసుక రవాణాకు కేటాయించిన వాహనం ఎక్కువ సమయం స్టాక్ పాయింట్ వద్ద వేచి ఉండకుండా కేటాయించిన సమయానికి లోడింగ్ జరిగేలా చర్యలు తీసుకోవాలని, ఆయన సూచించారు. వాహనానికి జీపీఎస్ విధానం ద్వారా ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలన్నారు. గ్రామ/వార్డు సచివాలయాల ద్వారానే కాకుండా వ్యక్తిగతంగా కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేలా పోర్టల్ రూపొందించామన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఆర్డీఓలు ఎన్ .ఎస్.కె. ఖాజావలి, కె. అద్దయ్య, రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ ఎస్. శాంతకుమారి, డిపిఓ తూతిక శ్రీనివాస విశ్వనాధ్, గనుల శాఖ డిడి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.


Similar News