Eluru: రన్నింగ్ ట్రైన్ నుంచి జారి పడిన వ్యక్తి.. ఏటూరు సమీపంలో ఘటన
కదులుతున్న రైలులో నుంచి ఓ యువకుడు జారి పడిన ఘటన ఏలూరు జిల్లా(Eluru District)లో జరిగింది.
దిశ, వెబ్ డెస్క్: కదులుతున్న రైలులో నుంచి ఓ యువకుడు జారి పడిన ఘటన ఏలూరు జిల్లా(Eluru District)లో జరిగింది. ఏలూరు కొత్త బస్టాండ్ సీఆర్ఆర్ కళాశాల తమ్మిలేరు అండర్ రైల్వేబ్రిడ్జి(Thammileru Under Railway Bridge) వద్ద అర్థరాత్రి సమయంలో అరుపులు, కేకలు వినిపించాయి. దీంతో చుట్టు పక్కల ఉన్న స్థానికులు గమణించి, అగ్నిమాపక శాఖ(Fire Department) అధికారులకి ఫోన్ చేశారు. దీనిపై సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని అండర్ పాస్ కింద ఓ వ్యక్తి పడిపోయినట్లు గుర్తించారు. దాదాపు 3 గంటల పాటు శ్రమించి ఆ వ్యక్తిని కాపాడారు. అనంతరం చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు.