CTET NOTIFICATION 2024: టీచర్ అభ్యర్థులకు అలర్ట్! 'సీటెట్' డిసెంబర్ నోటిఫికేషన్ వచ్చేసింది..పరీక్ష తేదీలు ఇవే!

దేశ వ్యాప్తంగా సీబీఎస్ఈ(Central Board of Secondary Education) నిర్వహించే కేంద్రీయ ఉపాధ్యాయ అర్హత పరీక్ష(Central Teacher Eligibility Test)కు నోటిఫికేషన్ విడుదలైంది.

Update: 2024-09-18 15:46 GMT

దిశ, వెబ్ డెస్క్: దేశ వ్యాప్తంగా సీబీఎస్ఈ(Central Board of Secondary Education) నిర్వహించే కేంద్రీయ ఉపాధ్యాయ అర్హత పరీక్ష(Central Teacher Eligibility Test)కు నోటిఫికేషన్ విడుదలైంది. ఆంగ్లం, హిందీ భాషల్లో నిర్వహించే ఈ పరీక్షకు అక్టోబర్ 16, 2024 వరకూ ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరించనున్నారు.

సీబీఎస్ఈ.. సీటెట్(C-TET) ను ప్రతి ఏటా 2 సార్లు నిర్వహిస్తోంది. దీనికి సంబంధించిన దరఖాస్తులు మంగళవారం (సెప్టెంబర్ 17) నుండి ప్రారంభమయ్యాయి. అప్లికేషన్ ఫీజు.. జనరల్/ఓబీసీ అభ్యర్థులకు ఒక పేపర్(paper-1/2) కు రూ.1000; రెండు పేపర్ లకు రూ.1200 ఉంటుంది.(ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులకు ఒక పేపర్ కు రూ.500, రెండు పేపర్ లకు రూ.600 ఉంటుంది). సీ-టెట్ లో సాధించిన స్కోరును కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండే పాఠశాలల ఉపాధ్యాయ నియామకాల్లో పరిగణలోకి తీసుకుంటారు. సీ-టెట్ పరీక్ష లో అర్హత సాధించిన వారికి జీవిత కాల వ్యాలిడిటీ ఉంటుంది.

ఈ పరీక్షలో మొత్తం రెండు పేపర్లు ఉంటాయి. 1-5 తరగతుల వరకు బోధించాలనుకునేవారు పేపర్-1; 6-9 తరగతుల వరకు బోధించాలనుకునేవారు పేపర్-2 పరీక్ష రాయాల్సి ఉంటుంది. పేపర్-2 పరీక్ష ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, పేపర్-1 పరీక్ష మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. అప్లికేషన్ చేశాక ఏమైనా తప్పులు ఉంటే అక్టోబర్ 21 నుంచి 25 తేదీల మధ్య సవరణకు అవకాశం ఉంటుంది. అయితే సీ-టెట్ హాల్ టికెట్లను ఎగ్జామ్ కు రెండు రోజుల ముందు విడుదల చేస్తారు. ఫలితాలను జనవరి నెలాఖరుకు విడుదల చేసే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాలలో.. హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి లలో పరీక్షలను నిర్వహిస్తారు. దరఖాస్తు తదితర వివరాలకు వెబ్ సైట్ https://ctet.nic.in/ ను సందర్శించండి.


Similar News