Inter Exams: ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. పరీక్ష ఫీజు చెల్లింపుకు మరో అవకాశం..!

ఆంధ్రప్రదేశ్(AP) ఇంటర్మీడియట్ విద్యార్థులకు(Inter Students) ప్రభుత్వం శుభవార్త చెప్పింది.

Update: 2024-12-25 13:13 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్(AP) ఇంటర్మీడియట్ విద్యార్థులకు(Inter Students) ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇంటర్ పబ్లిక్ పరీక్షల ఫీజు(Exam Fee) చెల్లింపుకు విద్యార్థులకు మరో అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇంటర్మీడియట్ విద్యామండలి సెక్రటరీ కృతికాశుక్లా(Kritikashukla) ఓ ప్రకటనలో తెలిపారు. ఇప్పటివరకు వివిధ కారణాల వల్ల ఫీజు పే(pay) చేయని వారు తత్కాల్(Tatkal) విధానం కింద రూ. 3000 అపరాధ రుసుముతో డిసెంబర్ 24 నుంచి 31 వరకు చెల్లించే అవకాశం కల్పించాలని పేర్కొన్నారు. ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లింపుకు ఇదే లాస్ట్ ఛాన్స్(Last Chance) అని, విద్యార్థులు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కాగా ఇంటర్ మొదటి సంవత్సరం(First Year) పరీక్షలు మార్చి 5 నుంచి 24 వరకు జరగనుండగా.. ఇంటర్ సెకండ్ ఇయర్(Second Year) ఎగ్జామ్స్ మార్చి 6 నుంచి 25 వరకు నిర్వహించనున్నారు.

Tags:    

Similar News