SSC Exams: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. పదో తరగతి పరీక్ష ఫీజు గడువు పొడగింపు..!

పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రాసే విద్యార్థులకు ఏపీ(AP) SSC బోర్డ్ గుడ్ న్యూస్ చెప్పింది.

Update: 2024-12-25 10:12 GMT

దిశ, వెబ్‌డెస్క్: పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రాసే విద్యార్థులకు ఏపీ(AP) SSC బోర్డ్ గుడ్ న్యూస్ చెప్పింది. వివిధ కారణాల వల్ల మార్చి-2025 పరీక్ష ఫీజు(Exam Fee) చెల్లించని వారికి మరో అవకాశం కల్పించింది. తత్కాల్(Tatkal) విధానం కింద ఫీజు గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పరీక్షల విభాగం సంచాలకులు కేవీ శ్రీనివాసులు రెడ్డి(KV Srinivasulu Reddy) ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు ఫీజు చెల్లించనివారు తత్కాల్ కింద రూ. 1000 ఫైన్(Fine)తో ఈ నెల 27 నుంచి జనవరి 10 వరకు పే చేయవచ్చని పేర్కొన్నారు. పాఠశాల హెడ్ మాస్టర్(HM), ప్రిన్సిపాళ్లు(Principals) విద్యార్థులు ఫీజును ఆన్ లైన్ లో చెల్లించాలని సూచించారు.

పదో తరగతి ఎగ్జామ్ షెడ్యూల్ ఇదే..

  • మార్చి 17 - ఫస్ట్ లాంగ్వేజ్
  • మార్చి 19 - సెకండ్ లాంగ్వేజ్
  • మార్చి 21 - ఇంగ్లీష్
  • మార్చి 24 - మ్యాథ్స్
  • మార్చి 26 - ఫిజిక్స్
  • మార్చి 28 - బయోలజీ
  • మార్చి 31 - సోషల్ స్టడీస్ 
Tags:    

Similar News