Breaking: రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా

రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి..

Update: 2025-03-20 10:43 GMT
Breaking: రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా(Assembly sessions postponed) పడ్డాయి. 15 రోజులు పాటు జరిగిన ఈ సమావేశాల్లో 9 బిల్లులకు సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. 85 గంటల 55 నిమిషాల పాటు వివిధ బిల్లులపై చర్చించారు. రాష్ట్ర బడ్జెట్‌తో పాటు పలు బిల్లులపై వాడీవేడీగా చర్చించారు. సహకార బ్యాంకుల అవకతవకలపై సభా సంఘాన్ని నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. చివరి రోజు ఏపీ అసెంబ్లీతో పాటు శాసన మండలిలోనూ ఎస్సీ వర్గీరణ బిల్లును ప్రవేశ పెట్టారు. రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ఈ బిల్లును ప్రవేశ పెట్టారు. ఎస్సీ వర్గీకరణ బిల్లుకు అసెంబ్లీలో తెలుగుదేశంతో పాటు జనసేన మద్దతు తెలిపింది.  ఎస్సీ వర్గీకరణ ప్రతిపాదనపై సీఎం చంద్రబాబుతో సహా పలువురు సభ్యులు మాట్లాడారు. అనంతరం ఉభయసభలను నిరవధికంగా వాయిదా వేస్తూ అసెంబ్లీలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రకటన చేశారు. 

Tags:    

Similar News