‘ఇళ్ల మధ్య నిలిచిన నీటిని మోటార్లతో తోడించాలి’: మంత్రి నారా లోకేశ్

భారీ వర్షంతో ఏపీ రోడ్లన్నీ జలమయమయ్యాయి.

Update: 2024-09-01 05:48 GMT

దిశ, వెబ్‌డెస్క్: భారీ వర్షంతో ఏపీ రోడ్లన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీటిలో మునగడంతో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. పలువురు మంత్రులు వరద బాధితులకు సూచనలు చేస్తున్నారు. అధికారులకు అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ఫీల్డ్ లోనే ఉంటూ, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వాతావణశాఖ ఏపీలోని 8 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. 10 జిల్లాలకు ఆరెంజ్ అలర్డ్, మరో 8 జిల్లాలకు ఎల్లో అలర్డ్ జారీ చేసింది. తాజాగా అకాల వర్షాలపై మంత్రి నారా లోకేశ్ స్పందించి.. ‘మంగళగిరి నియోజకవర్గంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉదయం నుంచి పర్యటిస్తున్నాను. మంగళగిరి టౌన్ రత్నాల చెరువు ప్రాంతంలో ముంపు బాధితులతో మాట్లాడాను. ప్రభుత్వం తరపున అందించిన సాయాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నాను. మసీదు లైన్‌లో చేనేత కార్మికుల ఇళ్లు పరిశీలించాను. ఇళ్ల మధ్య నిలిచిన నీటిని మోటార్లతో తోడించాలని అధికారులకు ఆదేశాలిచ్చాను. ముంపు ప్రాంతాల వాసులుకు ఆహారం, తాగునీరు అందించాలని సూచించాను’ అని మంత్రి లోకేశ్ చెప్పుకొచ్చారు. 


Similar News