SSC Results: పదో తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఆ తేదీనే ఫలితాల విడుదల
రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు ఇప్పటికే ముగిసాయి. దీంతో విద్యార్థినీ, విద్యార్థులంతా ఫలితాలు ఎప్పడు విడుదల చేస్తారా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు ఇప్పటికే ముగిసాయి. దీంతో విద్యార్థినీ, విద్యార్థులంతా ఫలితాలు ఎప్పడు విడుదల చేస్తారా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అధికారులు కీలక అప్‌డేట్ ఇచ్చారు. ఈ నెలాఖరుకు పదో తరగతి ఫలితాలు విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు. అన్నీ అనుకూలిస్తే.. ఈనెల 25నే ఫలితాలు ప్రకటించేందుకు రెడీ అవుతున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో రిజల్ట్స్ ప్రకటించేందుకు ఈసీ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. వారి అనుమతి వచ్చిన వెంటనే ఈ నెలాఖరున ఫలితాలు వెల్లడించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. కాగా, రాష్ట్ర వ్యాప్తంగ మార్చి18 నుంచి మార్చి 30 వరకు పదో తరగతి పరీక్షలను నిర్వహించారు. అందులో 6,30,633 మంది విద్యార్థినీ, విద్యార్థులు పరీక్షలు రాశారు. ఈ నెల 8తో పేపర్లు దిద్దే ప్రక్రియ పూర్తైంది.