‘కల్తీ మద్యం గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం హాస్యాస్పదం’

ఆంధ్రప్రదేశ్‌లో మద్యం తక్కువ ధరలకు అమ్మడానికి క్వాలిటీ తగ్గిస్తున్నారంటూ మాజీ సీఎం చేసిన వ్యాఖ్యలకు టీడీపీ నేత సోమిరెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

Update: 2024-10-15 07:42 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో మద్యం తక్కువ ధరలకు అమ్మడానికి క్వాలిటీ తగ్గిస్తున్నారంటూ మాజీ సీఎం చేసిన వ్యాఖ్యలకు టీడీపీ నేత సోమిరెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఈ రోజు (మంగళవారం) మీడియాతో మాట్లాడిన సోమిరెడ్డి.. కల్తీ మద్యంపై జగన్ మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని, ఐదేళ్లలో మద్యం ద్వారా జగన్ వేల కోట్లు దోచుకుంటే చంద్రబాబు రూ.5 వేల కోట్ల ఆదాయం తెచ్చారని స్పష్టం చేశారు. జగన్ హయాంలో ప్రతి నెల రూ.250 కోట్లు లోటస్‌పాండ్‌కు తరలించేవారని ఆరోపించిన సోమిరెడ్డి.. రూ.100 కోట్ల అవినీతి ఆరోపణలకే కేజ్రీవాల్, సిసోడియా జైలుకెళ్లారని, కానీ వందల కోట్ల స్కామ్ చేసిన జగన్ బయట తిరుగుతున్నారని అన్నారు. జగన్ ఇప్పటికైనా నీచ రాజకీయాలు ఆపాలని హితవు పలికారు.

ఇదిలా ఉంటే ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త మద్యం పాలసీ తీసుకొచ్చి టెండర్ల ద్వారా ప్రైవేటు వ్యక్తులకు మద్యం దుకాణాల బాధ్యత అప్పగించిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై ట్విటర్ వేదికగా స్పందించిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి.. ప్రభుత్వం ఆధ్వర్యంలో అద్భుతంగా నడుస్తున్న మద్యం దుకాణాలను ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకుని వేల కోట్లు దోచుకోవాలని ప్లాన్ చేస్తోందని, సిండికేట్లుగా ఏర్పడి మద్యం మాఫియాను సృష్టిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కామెంట్లను టీడీపీ నేతలంతా స్ట్రాంగ్‌గా కౌంటర్ చేస్తున్నారు. 


Similar News