పిఠాపురంలో దారుణం.. మహారాజా కుటుంబ సభ్యుల ఆస్తి కబ్జాకు యత్నం
పిఠాపురంలో మహారాజా కుటంబ సభ్యుల ఆస్తిని కబ్జా చేసేందుకు కొందరు వ్యక్తులు ప్రయత్నం చేశారు. ...
దిశ, వెబ్ డెస్క్: పిఠాపురంలో మహారాజా కుటుంబ సభ్యుల ఆస్తిని కబ్జా చేసేందుకు కొందరు వ్యక్తులు ప్రయత్నం చేశారు. వారసత్వంగా వచ్చిన ఇంట్లో మహారాజా కుటుంబ సభ్యులు ఉంటున్నారు. అయితే ఆ ఆస్తి తమదని దుండగులు రెచ్చిపోయారు. ఇంట్లో ఉంటున్న మహారాజా కుటుంబ సభ్యులపై దాడి చేశారు. ఆస్తికి సంబంధించి అన్ని పత్రాలు ఉన్నాయని, ఖాళీ చేసి వెళ్లాలని బెదిరించారు. దీంతో మహారాజా కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే సీఐ బాగా స్పందించారని, ఎస్ఐ మాత్రం బెదిరింపులకు దిగారని ఆరోపించారు . తమ పైనే ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేస్తానని బెదిరించారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఆస్తిని కబ్జా చేసేందుకు ప్రయత్నించిన వారెవరో తమకు తెలియదని, కానీ ఇంట్లోకి వచ్చి దాడి చేశారని తెలిపారు. ఈ విషయం పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్తామని మహారాజా కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.