స్కిల్ స్కాం కేసు: చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా
స్కిల్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది.
దిశ, డైనమిక్ బ్యూరో : స్కిల్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. ఈనెల 16కు విచారణను వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు న్యాయమూర్తి తెలియజేశారు. చంద్రబాబు నాయుడు బెయిల్ పిటిషన్‌పై బుధవారం విచారణ ప్రారంభమైంది. హైకోర్టు విచారణ చేపట్టగా.. సీఐడీ తరఫు న్యాయవాదులు పాస్ ఓవర్ అడిగారు. అదనపు అఫిడవిట్ దాఖలు చేసేందుకు సమయం కావాలని కోరారు. దీంతో హైకోర్టు విచారణను మధ్యాహ్నాం 12.15లకు వాయిదా వేసింది. అనంతరం మధ్యాహ్నం నుంచి కోర్టులో వాదనలు జరిగాయి. సీఐడీ అదనఫు అఫిడవిట్‌ను దాఖలు చేసింది. చంద్రబాబు నాయుడుకు బెయిల్ ఇవ్వొద్దంటూ అఫిడవిట్‌లో పేర్కొంది. సీఐడీ తరఫు న్యాయవాది ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. అనంతరం హైకోర్టు వాదనలను గురువారానికి వాయిదా వేసింది.
బెయిల్ ఇవ్వొద్దు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు స్కిల్ స్కాం కేసులో బెయిల్ ఇవ్వొద్దంటూ ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. చంద్రబాబు నాయుడుకు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని వాదించారు. చంద్రబాబు నాయుడుపై రెజూమ్ రివేంజ్‌లో భాగంగా కేసు నమోదు చేసినట్లు ఆరోపణల్లో వాస్తం లేదన్నారు. స్కిల్ స్కాం జరిగిందని చెప్పుకొచ్చారు. ఈ కుంభకోణంలో వచ్చిన డబ్బులు హవాలా రూపంలో చేరిందన్నారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు సీఐడీ వద్ద ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఈ నిధులు టీడీపీ ఖాతాల ద్వారా మళ్లించినట్లు సైతం ఆధారాలు ఉన్నట్లు వాదనలు వినిపించారు. ఈ పరిణామాల నేపథ్యంలో చంద్రబాబుకు బెయిల్ ఇవ్వొద్దు అని సూచించారు. అంతేకాదు స్కిల్ స్కాం కేసు ఇప్పటికిప్పుడు పెట్టింది కాదని 2015లో కుంభకోణం బయటపడిందన్నారు.కేసు విచారణ 2018లో ప్రారంభమైనట్లు ఏఏజీ వాదించారు. ఏసీబీ, సీబీఐకు సైతం ఫిర్యాదులు అందినట్లు వాదించారు. కక్షపూరితంగా కేసు పెట్టారనేది కేవలం ఆరోపణలు మాత్రమేనని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. వాదనలు విన్న హైకోర్టు విచారణను రేపటికి వాయిదా వేసింది. గురువారం మధ్యాహ్నాం 2.15గంటలకు విచారణ చేపట్టనున్నట్లు హైకోర్టు న్యాయమూర్తి తెలిపారు.
గుండె సంబంధిత సమస్యలు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కంటి ఆపరేషన్ , హెల్త్ కండీషన్ వివరాలను హైకోర్టుకు న్యాయవాది అందజేశారు. వైద్యుల సూచనల నివేదికను మెమో ద్వారా కోర్టుకు అందజేశారు. ఏఐజీ ఆస్పత్రిలో చంద్రబాబు నాయుడు తీసుకుంటున్న చికిత్స వివరాలను అందులో పొందుపరిచారు. చంద్రబాబు నాయుడు చర్మ సంబంధిత చికిత్స ,గుండె సంబంధిత సమస్యలపై చికిత్స తీసుకుంటున్నట్లు తెలిపారు. చంద్రబాబు నాయుడు గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారని తెలిపారు. కాల్షియం స్కోర్ అధికంగా ఉందని వైద్యులు తెలిపారని అంటున్నారు. అదే సమయంలో గుండె పరిణామం పెరిగిందని వైద్యులు తెలియజేసినట్లు తెలిపారు. అలాగే గుండెకు రక్తం సరఫరా చేసే రక్తనాళాలకు సంబంధించి సమస్యలు ఉన్నాయని ఈ నేపథ్యంలో కొన్ని రోజులపాటు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్లు తెలిపారు. అనారోగ్యం నుంచి కోలుకునేందుకు మందులు వాడాలని వైద్యులు సూచించారని కోర్టుకు తెలిపారు. ప్రస్తుతం మధమేహం అదుపులో ఉందని.. అయితే జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందని వైద్యులు సూచించినట్లు కోర్టుకు మెమోలో తెలియజేశారు.
కంటికి ఐదు వారాలపాటు చెకప్ తప్పనిసరి
మరోవైపు చంద్రబాబు నాయుడు కంటి ఆపరేషన్‌కు సంబంధించి వివరాలను కోర్టుకు తెలియజేశారు. చంద్రబాబు నాయుడు కుడి కంటికి శస్త్రచికిత్స జరిగిందని తెలిపారు. చంద్రబాబు కంట్లో ఐదు వారాలపాటు చుక్కల మందు వేయించాల్సిన అవసరం ఉందని మెమోలో తెలిపింది. ఐదు వారాలపాటు ఇన్ ట్రా ఆక్యుకలర్ ప్రెజర్ చెకప్ తప్పనిసరి అని వైద్యులు సూచించినట్లు న్యాయవాది తెలిపారు. ఈమేరకు ఐదువారాలపాటు కంటి చెకప్ కోసం షెడ్యూల్‌ను కోర్టుకు అందజేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు నాయుడుకు ఐదు వారాలపాటు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్లు న్యాయవాది కోర్టుకు తెలిపారు. చంద్రబాబు నాయుడు మరికొన్నిరోజులు వైద్యుల పర్యవేక్షణలో ఉండాల్సిన అవసరం ఉందని అన్నారు. అనారోగ్యం నుంచి కోలుకునేందుకు మెడిసిన్స్ వాడాల్సి ఉందని వైద్యులు సూచించారని చంద్రబాబు నాయుడు తరఫు న్యాయవాదులు మోమోలో కోర్టుకు తెలియజేశారు.
అదనపు అఫిడవిట్ దాఖలు
స్కిల్ స్కాం కేసు విచారణలో సీఐడీ హైకోర్టులో అదనపు అఫడవిట్ దాఖలు చేసింది. ఈ మేరకు సీఐడీ తరఫు న్యాయవాది ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి అఫిడవిట్ దాఖలు చేశారు. తెలుగుదేశం పార్టీ ఖాతాలకు సంబంధించి వివరాలు కావాలని కోరింది. ఈమేరకు ఇప్పటికే టీడీపీ కార్యదర్శికి నోటీసులు అందజేసినట్లు తెలిపింది. పార్టీల ఖాతాల వివరాలు ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని కోరింది. పార్టీ బ్యాంక్ ఖాతాల వివరాలు ఇవ్వాలని కోరుతూ కార్యాలయ కార్యదర్శి అశోక్‌బాబుకు నోటీసులు అందజేసినట్లు తెలిపారు. ఈనెల 18లోగా వివరాలు ఇవ్వాలని అందులో పేర్కొన్నట్లు స్పష్టం చేశారు. స్కిల్ కేసుకు సంబంధించి పార్టీ ఖాతాలోకి వచ్చిన విరాళాల వివరాలు కావాలని కోరింది.అఫిడవిట్ అనంతరం ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపిస్తున్నారు.