విశాఖ సెంట్రల్ జైలు వివాదం: 66 మందిపై బదిలీ వేటు

విశాఖ సెంట్రల్ జైలు వివాదంలో 66 మందిపై బదిలీ వేటు పడింది..

Update: 2024-12-30 07:08 GMT

దిశ, వెబ్ డెస్క్: విశాఖ సెంట్రల్ జైలు(Visakha Central Jail)లో వివాదం నెలకొన్ని విషయం తెలిసిందే. జైలు సూపరింటెండెండ్(Superintendent), వార్డెన్ల(Wardens) మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటోంది. విధుల నిర్వహణకు వెళ్లిన తమను తనిఖీల పేరుతో సూపరింటెండెంట్ వేధిస్తున్నారని వార్డెన్లు ఆరోపిస్తున్నారు. జైలులో ఖైదీల వద్ద సిగరెట్లు, ఖైనీలు, గంజాయి దొరికిన నేపథ్యంలో ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నామని సూపరింటెండెంట్ చెబుతున్నారు. అయితే ఈ వివాదం వార్గెన్ల ఫ్యామిలీలను కూడా తాకింది. తమ భర్తలను సూపరింటెండెంట్ వేధిస్తున్నారని జైలు బయట వార్డెన్ల కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. దీంతో ఈ ఆందోళనలపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. క్షమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడ్డారని మొత్తం 66 మంది వార్డెన్లు, హెడ్ వార్డెన్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు చేసింది.  

Tags:    

Similar News