Breaking: టీటీడీ ఈవో శ్యామలారావు కీలక వ్యాఖ్యలు

టీటీడీ ఈవోగా శ్యామలారావు బాధ్యతలు తీసుకున్నారు...

Update: 2024-06-16 11:59 GMT

దిశ, వెబ్ డెస్క్: టీటీడీ ఈవోగా శ్యామలారావు బాధ్యతలు తీసుకున్నారు. అనంతరం ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుమలలో భక్తుల రద్దీపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలిపారు. టీడీడీ ఈవోగా తనకు వచ్చిన అవకాశాన్ని అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. భక్తులకు అన్ని విధాలుగా సౌకర్యాలు కల్పిస్తామన్నారు. భక్తులకు ఇక నుంచి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా శ్రీవారి దర్శించేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు. శ్రీవారి దర్శనానికి రోజుకు డెబ్బై నుంచి ఎనబై వేల మంది భక్తులు వస్తుంటారని, వారికి అన్ని సదుపాయాలు కల్పిస్తామని ఈవో శ్యామలారావు పేర్కొన్నారు. తిరుమలలో జరిగే ప్రతి పనిలోనూ పారదర్శకత పాటిస్తామని చెప్పారు. శ్రీవారి దర్శనం అనంతరం ప్రతి భక్తుడు ఆనందంగా స్వస్థలాలకు వెళ్లేలా చూస్తామని శ్యామలారావు తెలిపారు. 

కాగా వైఎస్ జగన్  ప్రభుత్వ హయాంలో తిరుమల కొండపై అరాచకమే రాజ్యమేలింది. వైసీపీ నేతలు చెప్పినట్టే కార్యక్రమాలు జరిగాయి. అంతేకాదు తిరుమల ప్రవిత్రతతో పాటు భద్రత, అన్న ప్రసాదం, లడ్డూల విషయంలోనూ అప్పట్లో తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. జగన్ హయాంలో టీటీడీ ఈవోగా పని చేసిన ధర్మారెడ్డి.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకూడిగా వ్యవహరించినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది.

దీంతో తాము అధికారంలోకి వస్తే టీటీడీలో ప్రక్షాళన చేపడతామని ప్రతిపక్షనేతలు చెప్పారు. చెప్పినట్టుగా టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. దీంతో శ్రీవారిని దర్శించుకున్న చంద్రబాబు నాయుడు సైతం టీటీడీలో ప్రక్షాళన చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఈ మేరకు టీటీడీలో ప్రభుత్వం ప్రక్షాళన చేపట్టింది. ఈవోగా ఉన్న ధర్మారెడ్డిని తొలగించింది. కొత్త ఈవోగా శ్యామలరావును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో శ్యామలారావు ఆదివారం ఈవోగా బాధ్యతలు స్వీకరించారు. 


Similar News