SHOCKING: సీక్రెట్ కెమెరా ఘటన.. నిందితురాలిని ఇంటికి పంపించిన యాజమాన్యం.. సంచలనం సృష్టిస్తున్న వీడియో

ప్రస్తుతం గుడ్లవల్లేరు హాస్టల్‌లో హిడెన్ కెమెరాలు పెట్టిన ఘటన ఏపీలో దుమ్ము దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే.

Update: 2024-08-31 06:31 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం గుడ్లవల్లేరు హాస్టల్‌లో హిడెన్ కెమెరాలు పెట్టిన ఘటన ఏపీలో దుమ్ము దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. అయితే రెండు నెలలుగా ఈ వ్యవహారం సాగుతుందని.. 300 వీడియోలు నిందితుల దగ్గర ఉన్నాయని తెలుస్తోంది. ఈ వ్యవహారం గురించి కాలేజీ యాజమాన్యానికి ఫిర్యాదు చేస్తే వారు సరిగా స్పందించకపోవడంతో.. విద్యార్థినులు ఆందోళనకు దిగారు. గురువారం అర్ధరాత్రి కాలేజీ ప్రాంగణంలో ఆందోళన చేయడమే కాక.. నిందితుడిపై దాడి చేశారు. బీటెక్ ఫైనలియర్‌కు చెందిన ఓ విద్యార్థిని సాయంతో నిందితులు ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తుంది. ఇక కాలేజీలో ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉండటంతో.. యాజమాన్యం సెలవులు ప్రకటించి.. విద్యార్థులను ఇంటికి పంపించింది. ఈ క్రమంలో నిందిత విద్యార్థినికి సంబంధించిన ఓ కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు..

గుడ్లవల్లేరు కాలేజీ హిడెన్ కెమెరాల ఘటన వెనుక ఉన్నది అదే కాలేజీకి చెందిన ఓ యువతి కావడం సంచలనంగా మారింది. ఆమె బాయ్ ఫ్రెండ్, మరికొందరు విద్యార్థులు కలిసి నిందితురాలిని బెదిరించడంతో ఇంతటి దారుణానికి ఒడిగట్టింది. కాలేజీలో ఉద్రిక్త పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని యాజమాన్యం సదరు విద్యార్థినిని గుట్టు చప్పుడు కాకుండా కాలేజీ నుంచి తప్పించినట్లు తెలుస్తోంది. పైగా ఇంతటి తప్పు చేసినప్పటికి.. సదరు విద్యార్థినిలో ఎలాంటి బెరుకు, భయం లేవని.. పైపెచ్చు.. రివర్స్ లో మిగతా స్టూడెంట్స్ ని బెదిరిస్తుందని విద్యార్థులు తెలిపారు. మిగతా విద్యార్థినులు ఆమెపై దాడి చేయడానికి యత్నించగా సదరు యువతి మిడిల్ ఫింగర్ చూపించడం గమనార్హం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.

For Video : https://x.com/TeluguScribe/status/1829571347045085417


Similar News