TET Exam Results:టెట్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. రేపే ఫైనల్ కీ రిలీజ్.. ఫలితాలు ఎప్పుడంటే?

రాష్ట్రంలోని టెట్ అభ్యర్థులకు(TET candidates) బిగ్ అలర్ట్. ఏపీలో ఈ నెల(అక్టోబర్‌) 3 నుంచి 21వ తేదీ వరకు టెట్ పరీక్షలు (TET Exams) జరిగిన విషయం తెలిసిందే.

Update: 2024-10-26 08:12 GMT

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని టెట్ అభ్యర్థులకు(TET candidates) బిగ్ అలర్ట్. ఏపీలో ఈ నెల(అక్టోబర్‌) 3 నుంచి 21వ తేదీ వరకు టెట్ పరీక్షలు (TET Exams) జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే విద్యాశాఖ(Department of Education) అన్ని పరీక్షల(Exams) ప్రాథమిక కీ(Primary key)లను విడుదల చేసింది. ఈ కీ లపై అభ్యంతరాలు కూడా స్వీకరించింది. ఈ క్రమంలో టెట్ ఫైనల్ ‘కీ’ని(Tet Final 'Key') రేపు(అక్టోబర్ 27) విడుదల చేయనుంది. పాఠశాల విద్యాశాఖ వెబ్‌సైట్‌(Website) https://aptet.apcfss.in/ నుంచి వీటిని డౌన్లోడ్(Download) చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో విద్యాశాఖ మరో కీలక ప్రకటన చేసింది. టెట్ పరీక్షల ఫలితాలు(TET Exam Results) ప్రకటించేందుకు విద్యాశాఖ సిద్ధమవుతోంది. ఈ క్రమంలో వచ్చే నెల(నవంబర్ 2)న టెట్ తుది ఫలితాల(Final Results)ను విడుదల చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. అభ్యర్థులు(TET candidates) ఫైనల్ రిజల్ట్స్‌ను అధికారిక వెబ్ సైట్‌లోకి వెళ్లి చెక్ చేసుకోవచ్చు.

టెట్ ‘కీ’ ని డౌన్‌లోడ్ చేసుకునే విధానం:

*https://aptet.apcfss.in/ వెబ్ సైట్లోకి వెళ్లాలి.

*హోం పేజీలోని 'Question Papers & Keys' ట్యాబ్‌పై క్లిక్ చేయాలి.

*మీ పరీక్ష తేదీని అనుగుణంగా ప్రాథమిక కీ డౌన్‌లోడ్ లింక్‌పై క్లిక్ చేయండి.

*టెట్ ఎగ్జామ్ పేపర్(TET Exam Paper), ఆన్సర్ కీ(Answer Key)ని చెక్ చేసి డౌన్‌లోడ్ చేయండి.

Tags:    

Similar News