YSRCP : వైఎస్సార్‌సీపీకి భారీ షాక్.. 16 మందికి నోటీసులు

ఏపీలోని ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ(YSRCP)కి భారీ షాక్‌ తగిలింది.

Update: 2024-11-24 16:16 GMT

దిశ, వెబ్ డెస్క్ : ఏపీలోని ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ(YSRCP)కి భారీ షాక్‌ తగిలింది. ఆ పార్టీ సోషల్‌ మీడియా వింగ్‌ రాష్ట్ర నేతలైన సజ్జల భార్గవ్‌(Sajjala Bhargav), అర్జున్‌రెడ్డితో పాటు మరో 15 మందికి నోటీసులు జారీ చేశారు. సోమవారం విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. సోషల్‌ మీడియాలో కూటమి ప్రభుత్వ నేతలపై అసభ్య, అభ్యంతరకర పోస్టుల నేపథ్యంలో ఈ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తున్నది. పోలీసులు విజయవాడలోని సజ్జల భార్గవ ఇంటికి వెళ్లారు. భార్గవ్‌ ఇంట్లో లేకపోవడంతో ఆయన తల్లికి నోటీసులు అందజేశారు. అలాగే, అర్జున్‌రెడ్డి సైతం అందుబాటులో లేకపోవడంతో ఇంటికి నోటీసులు అంటించి వెళ్లారు. సజ్జల భార్గవ్‌, అర్జున్‌రెడ్డి ఇద్దరూ దేశం విడిచి వెళ్లకుండా ఇప్పటికే పోలీసులు లుక్‌ అవుట్‌ నోటీసులు జారీ చేశారు. ఇటీవల కడపకు చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త వర్రా రవీంద్రరెడ్డిని అరెస్టు చేసిన విషయం విధితమే. రవీంద్రరెడ్డి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగానే పోలీసులు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.


Similar News