‘Deputy CM Pawan Kalyan సార్.. మా గోడు ఆలకిచండి..’ పవన్‌ కల్యాణ్‌కు 4 గ్రామాల ప్రజల లేఖలు

Update: 2024-10-26 09:14 GMT

దిశ, వెబ్‌డెస్క్: తూర్పు గోదావరి (East Godavari) జిల్లా, గోకళ్ల మండలం గుమ్మళ్ల దొడ్డిలో 4 గ్రామాల ప్రజలు ఆమరణ దీక్షలకు దిగారు. అస్సాగో ఇథనాల్ (Ethanol) ఫ్యాక్టరీని మూసి వేయాలని ఆందోళనలకు దిగారు. 5 రోజులుగా నిర్విరామంగా ప్రజలంతా ఈ దీక్షలు చేస్తున్నారు. కంపెనీ వ్యార్థాలు, దుర్వాసనలతో రోగాల బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘‘మా ఆరోగ్యానికి హాని కలలిగించే ఫ్యాక్టరీ మాకొద్దు, ఫ్యాక్టరీ నుంచి వచ్చే పొగ, వాసన వల్ల మాకు ఊపిరి ఆడం లేదు’’ అంటూ నినాదాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ ఫ్యాక్టరీ (Factory) వల్ల వచ్చే వ్యర్థాల కారణంగా ఇప్పటికే 8 మంది మరణించారని కూడా గ్రామస్థులు చెబుతున్నారు. ఈ సందర్భంగా తమ గోడు వెళ్లబోసుకుంటూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు ఉత్తరాలు కూడా రాస్తున్నారు. ఈ విషయంపై సీఎం చంద్రబాబు (CM Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Deputy CM Pawan Kalyan) వెంటనే స్పందించాలని, తమకు మద్దతుగా నిలిచి ఫ్యాక్టరీని ముయించాలని డిమాండ్ చేస్తున్నారు. అదే విధంగా ఈ రోజు నుంచి స్కూళ్లు, షాపులను కూడా మూసి వేస్తున్నట్లు ప్రకటించారు.

కాగా.. ఇథనాల్ ఫ్యాక్టరీతో ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది లేదని చెబుతోంది కంపెనీ యాజమాన్యం. కంపెనీ అన్నాక వ్యర్థాలు, కొంచెం కాలుష్యం ఉండడం సహజమని, కానీ ఇది ఆరోగ్య సమస్యలకు కారణం కాదని చెబుతున్నారు. ఇక ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ప్రజల ఆరోగ్య పరిస్థితులను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.


 






 

Tags:    

Similar News