కళాకారులతో కలిసి డప్పు వాయించిన రోజా.. జగన్ పై ప్రశంసలు జల్లు

ఈ రోజు విజయవాడ లోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో కళాకారులకు గుర్తింపు కార్డుల ప్రదానోత్సవం నిర్వహించారు.

Update: 2024-01-20 11:05 GMT

దిశ వెబ్ డెస్క్: ఈ రోజు విజయవాడ లోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో కళాకారులకు గుర్తింపు కార్డుల ప్రదానోత్సవం నిర్వహించారు. ఈ మహోత్సవానికి మంత్రి ఆర్కే రోజా, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఇతర నేతలు, కళాకారులు హాజరయ్యారు. అనంతరం కార్యక్రమంలో భాగంగా మంత్రి రోజా కళాకారులకు గుర్తింపు కార్డులను అందచేశారు. ఆ తరువాత కళాకారులతో కలిసి డప్పువాయించారు మంత్రి రోజా. ఇక ఈ కార్యక్రమంలో ప్రసంగించిన రోజా జగన్ పై ప్రశంసలు జల్లు కురిపించారు.

రాష్ట్ర విభజన తరువాత కళాకారులకు గుర్తింపు కార్డులు ఇవ్వలేదని మండిపడ్డ రోజా.. గుర్తింపు కార్డులు లేక కళాకారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారని ఆవేధన వ్యక్తం చేసారు. కళాకారుల డేటా తీసుకున్నారు కానీ ఆ డేటా తీసుకోవడం వల్ల కళాకారులకు ఎలాంటి న్యాయం జరగలేదని ఆరోపించారు. అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అహర్నిశలు కళాకారుల కోసం తాపత్రయ పడతారని.. కళాకారులకు అండగా నిలబడాలనే ఉద్దేశంతో ఆయన కళాకారిణి అయిన తనకు మంత్రి పదవి ఇచ్చారని హర్షం వ్యక్తం చేశారు.

ఇక సాంస్కృతిక సంబరాల ద్వారా కళాకారులను గుర్తించి.. వాళ్లకు ధైర్యంగా కార్డుల ప్రదానోత్సవం చేయగలుగుతున్నామని పేర్కొన్నారు. అలానే సాంస్కృతిక సంబరాల్లో గుర్తింపు పొందిన కళాకారులకు సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకున్నామని.. మట్టిలో మాణిక్యంలా మారుమూలన ఉన్న కళాకారులకు కూడా గుర్తింపు కార్డులు అందచేస్తామని తెలిపారు. ఇక గతంలో ఎవరు కళాకారులను పట్టించుకోలేదని.. కేవలం జగన్మోహన్ రెడ్డి మాత్రమే కళాకారులను పట్టించుకున్నారని పేర్కొన్నారు.

ఇక కళాకారులూ కూడా ఆ విషయాన్ని గుర్తించాలి అని కళాకారులకు పిలుపునిచ్చిన రోజా.. ఎన్నికల సమయంలో దొంగలు దొంగలు ఏకమై పందుల్లా గుంపుగా వస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ దొంగలకు, పందులకు బుద్ధి చెప్పేందుకు కళాకారుల ఆట పాట మాట కావాలని కోరిన రోజ.. ట్వంటీ ట్వంటీ ఫోర్.. జగనన్న వన్స్ మోర్ అంటూ నినాదం చేశారు.  

Read More..

Breaking: ఆంధ్రాలో ఆగని అంగన్వాడీల వార్.. ఈడ్చుకెళ్లిన పోలీసులు  

Tags:    

Similar News