రాహుల్ గాంధీ ప్రధాని కావడం పై షర్మిల షాకింగ్ కామెంట్స్..

వైఎస్ షర్మిల కాంగ్రెస్ గూటికి చేరిన విషయం అందరికి సుపరిచితమే.

Update: 2024-01-23 07:51 GMT

దిశ వెబ్ డెస్క్: వైఎస్ షర్మిల కాంగ్రెస్ గూటికి చేరిన విషయం అందరికి సుపరిచితమే.కాగా గత రెండు రోజుల క్రితం ఆమె ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు కూడా స్వీకరించింది. అయితే అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత ఆమె కాంగ్రెస్ పార్టీ తరుపున ప్రచారంలో చురుగ్గా పాల్గొంటోంది. ఈ నేపథ్యంలో ఆమె ఈ రోజు నుండి మొత్తం 9 రోజుల వరకు రాష్ట్రవ్యాప్తంగా పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఇచ్ఛాపురం లో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రసంగించిన వైఎస్ షర్మిల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు . రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే దేశానికి మంచి జరుగుతుందని.. అలానే మతపరమైన హింసలు తగ్గుతాయని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మనస్ఫూర్తిగా నమ్మి రాహుల్ గాంధీని ప్రధానిని చెయ్యాలనుకున్నారని ఆమె పేర్కొన్నారు.

అందుకే తాను కూడా రాజశేఖర్ రెడ్డి బాటలోనే నడుస్తూ రాహుల్ గాంధీని ప్రధానిని చెయ్యడానికే తాను కాంగ్రెస్ లో చేరినట్లు వెల్లడించారు. ఇక తాను కాంగ్రెస్ పార్టీ లో చేరారు కనుక ఒకసారి వాళ్ళ చేతుల్లోకి వెళ్ళాక అధిష్టానం ఎలా చెప్తే అలానే చెయ్యాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఇక ఈ ఆమె ఈ రోజు ఇచ్ఛాపురంలో పర్యటిస్తున్నారు. కాగా ఇచ్ఛాపురం చేరుకోవడానికి ఆమె ఆర్టీసీ బస్సును ఎన్నుకున్నారు. పలాస నుండి ఇచ్ఛాపురం వరకు ఆమె బస్సు లో ప్రయాణించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రయాణికులతో ముఖాముఖీ నిర్వహించారు. ఇక మాణిక్యం ఠాగూర్, గిడుగు రుద్రరాజు, రఘువీరా రెడ్డి కూడా కాంగ్రెస్ అధ్యక్షురాలితో కలిసి బస్సులో ప్రయాణించారు. ఇక ఈ రోజు శ్రీకాకుళం జిల్లాతో పాటు పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లో ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల పర్యటించనున్నారు. 

Tags:    

Similar News