మాజీ సీఎం జగన్‌కు ఆవేదనతో లేఖ రాసిన షర్మిల, తల్లి విజయమ్మ..!

మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇంట్లో ఆస్తుల పంపకాల వివాదాలు తెరమీదకు వచ్చాయి.

Update: 2024-10-23 16:12 GMT

దిశ, వెబ్ డెస్క్: మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇంట్లో ఆస్తుల పంపకాల వివాదాలు తెరమీదకు వచ్చాయి. ఈ క్రమంలోనే సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ వాటాల పంపకాల వివాదంలో మాజీ సీఎం వైఎస్ జగన్(former CM Jagan) తన తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల(Sharmila)పై నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్(National Company Law Tribunal)లో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌లో ప్రతివాదులుగా సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, వైఎస్ షర్మిల, వైఎస్ విజయమ్మ, చాగరి జనార్దన్ రెడ్డి, కేతిరెడ్డి యశ్వంత్ రెడ్డి, రీజినల్ డైరెక్టర్ సౌత్ ఈస్ట్ రీజియన్, రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ తెలంగాణలను ప్రతివాదులుగా చేర్చిన విషయం తెలిసిందే అయితే ఇదే విషయంపై గతంలో మాజీ సీఎం జగన్ కు తన చెల్లి షర్మిల(Sharmila), తల్లి విజయమ్మ ఆవేదనతో రాసిన లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.

కాగా ఈ లేఖపై టీడీపీ(TDP) సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ విమర్శల వర్షం కురిపించింది. ట్విట్టర్‌లో టీడీపీ ట్వీట్‌లో "మీరు ఇప్పుడు సొంత తల్లి మీద కూడా కేసులు పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఎమ్‌ఓయు ప్రకారం మీ సొంత చెల్లికి చెందాల్సిన ఆస్తులు కూడా లాక్కోవాలని ప్రయత్నిస్తున్నారు. మన తండ్రి అడుగుజాడల్లో నడవాల్సిన మీరు ఈ విధంగా దారి తప్పడం నాకు ఆశ్చర్యం వేస్తుంది." సొంత తల్లి మీద కూడా కేసులు పెట్టాలని నిర్ణయించుకున్న నువ్వు నీ సొంత చెల్లికి చెందాల్సిన ఆస్తులు లాక్కోవడానికి సిద్ధమయ్యావా జగన్ మోహన్ రెడ్డి?" అంటూ రాసుకొచ్చారు. ఏది ఏమైనప్పటికి ప్రస్తుత మాజీ సీఎం ప్రవర్తన ఆయనను ఇబ్బందులకు గురిచేస్తుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

 


Similar News