33 కేసులు.. 1380 మంది నిందితులు.. సిట్ నివేదికలో సంచలన విషయాలు..!
ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకున్న అల్లర్లపై జరిపిన దర్యాప్తు నివేదికను స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) ఏపీ డీజేపీకి అందించింది.
దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకున్న అల్లర్లపై జరిపిన దర్యాప్తు నివేదికను స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) ఏపీ డీజేపీకి అందించింది. సిట్ రూపొందించిన 150 పేజీల ఇన్వెస్టిగేషన్ రిపోర్టులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఎన్నికల వేళ రాష్ట్ర వ్యాప్తంగా 33 హింసాత్మక ఘటనలు జరిగినట్లు సిట్ గుర్తించింది. పల్నాడులో 22, తిరుపతిలో 4, అనంతపురంలో 7 చోట్ల అల్లర్లు జరగగా.. మొత్తం 1370 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఇందులో ఇప్పటి వరకు 124 మందిని అరెస్ట్ చేయగా.. 94 మందికి నోటీసులు ఇచ్చినట్లు సిట్ స్పష్టం చేసింది.
మిగిలిన అన్ని ఘటనలపై కేసులు నమోదు చేయడంపై ఆరా తీస్తోన్న సిట్.. కొన్ని అదనపు సెక్షన్లు చేర్చడంపైన ఆలోచనలు చేస్తోంది. ఎన్నికల వేళ రెండు గ్రూపులుగా విడిపోయి పరస్పరం దాడులు చేసుకున్నారని, ఇరు వర్గాల మధ్య జరిగిన దాడులను తీవ్రంగా పరిగణిస్తున్నామని రిపోర్ట్‌లో సిట్ పేర్కొంది. మరణాలకు దారి తీసే స్థాయిలో రాళ్ల దాడి జరిగిందని రిపోర్ట్‌లో పొందుపర్చింది. అల్లర్లపై ఎన్నికల కౌంటింగ్ లోపు సిట్ మరో రిపోర్ట్ ఇచ్చే చాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
Read More...
ఏపీలో అదుపు తప్పిన లా అండ్ ఆర్డర్.. ఎస్పీ మలిక గార్గ్ కీలక వ్యాఖ్యలు