ఇంటర్ విద్యార్థిని హత్య కేసులో సంచలన విషయాలు వెల్లడి: జిల్లా ఎస్పీ

రాష్ట్రంలో ఇంటర్ విద్యార్థిని మృతి చెందిన ఘటన సంచలనంగా మారింది. ఈ క్రమంలో వైఎస్సార్ జిల్లా బద్వేల్‌లో ఇంటర్ విద్యార్థిని పై పెట్రోల్ దాడి కేసును తాజాగా పోలీసులు చేధించారు

Update: 2024-10-20 13:39 GMT

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ఇంటర్ విద్యార్థిని మృతి చెందిన ఘటన సంచలనంగా మారింది. ఈ క్రమంలో వైఎస్సార్ జిల్లా బద్వేల్‌లో ఇంటర్ విద్యార్థిని పై పెట్రోల్ దాడి కేసును తాజాగా పోలీసులు చేధించారు. కడప శివారులో నిందితుడు విఘ్నేష్‌ను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. ఈ క్రమంలో నేడు(ఆదివారం) ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిందితుడిని పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో కేసుకు సంబంధించిన విషయాలను జిల్లా ఎస్పీ వివరించారు. 

జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. ‘‘ నిందితుడు ప్లాన్ ప్రకారమే దాడి చేశాడు. ఐదేళ్లుగా వారికి పరిచయం ఉంది. శుక్రవారం ఉదయం అతను విద్యార్థినికి ఫోన్ చేశాడు. తనను కలవాలని ఆ బాలికను కోరారు. లేదంటే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. దీంతో ఆ బాలిక నిన్న(శనివారం) కళాశాల నుంచి ఆటోలో బయలుదేరగా విఘ్నేశ్ పాలిటెక్నిక్ కళాశాల వద్ద ఆటో ఎక్కారు. ఈ క్రమంలో ఇద్దరూ బద్వేల్‌కు 10కి.మీ దూరంలో ఉన్న సెంచురీ ప్లైవుడ్ ఫ్యాక్టరీ వద్ద ఆటో దిగారు. ఈ క్రమంలో సమీపంలో ఉన్న ముళ్లపొదల్లోకి వెళ్లారు. ఇద్దరూ కాసేపు సరదాగా గడిపారు. తనను పెళ్లి చేసుకోవాలని ఆ బాలిక అడగడంతో ఆగ్రహంతో ఊగిపోయిన విఘ్నేష్ పెట్రోల్ పోసి నిప్పంటించాడు. బాలిక కేకలు వేయడంతో అక్కడి నుంచి అతను పరారయ్యాడు’’ దర్యాప్తులో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు. ఘటనా స్థలంలో అన్ని ఆధారాలు సేకరించామని.. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా నిందితుడికి త్వరగా శిక్ష పడేలా చూస్తాం అని ఎస్పీ తెలిపారు.


Similar News