AP News: ప్రభుత్వంపై మాజీ మంత్రి రోజా ఫైర్.. వాటిని నిర్వహించాలని సంచలన డిమాండ్!

ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి రోజా మరోసారి విమర్శలు గుప్పించారు.

Update: 2024-09-15 11:52 GMT

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి రోజా మరోసారి విమర్శలు గుప్పించారు. గత వైసీపీ ప్రభుత్వం(YCP Government) తీసుకొచ్చిన కొత్త మెడికల్ కళాశాల(medical college)లను ప్రైవేటు చెయ్యాలని ప్రభుత్వం(Government) నిర్ణయించడం దారుణం అన్నారు. పులివెందుల మెడికల్ కళాశాలకు సీట్లు కేటాయించినా.. వాటిని రద్దు చెయ్యమని సీఎం చంద్రబాబు ప్రభుత్వం NMCకి లేఖ రాయడం దుర్మార్గమైన చర్య అని రోజా పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు(CM Chandrababu) తన పాలనలో ఒక్క ప్రభుత్వ మెడికల్ కళాశాలను (Government medical college)తీసుకురాలేదని అన్నారు.

ఈ క్రమంలో జగనన్న ప్రభుత్వం గతంలో ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీలను PPP విధానం పేరుతో ప్రైవైట్ పరం(Private) చేయాలనుకోవడం క్షమించరాని నేరం అంటూ రోజా ఫైరయ్యారు. మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్‌ పై ఉన్న ఈర్ష, ద్వేషంతో సీఎం చంద్రబాబు ఇలా మన రాష్ట్ర విద్యార్థుల భవిష్యత్‌ను నాశనం చేయాలనుకోవడం సరియైన విధానం కాదని మాజీ మంత్రి రోజా పేర్కొన్నారు. ప్రతిభ(Talent) గల పేద విద్యార్థులకు వైద్య విద్యను(Medical Education) దూరం చేయాలనుకోవడం అన్యాయమని పేర్కొన్నారు. రాష్ట్రంలో జగనన్న పాలనలో నిర్మాణం చేపట్టిన మెడికల్ కళాశాలలు అన్నీ ప్రభుత్వమే నిర్వహించాలని ఆర్కే రోజా ట్విట్టర్ వేదికగా డిమాండ్ చేశారు.


Similar News