AP High Court:పిన్నెల్లి బెయిల్ పిటిషన్ పై విచారణ..హైకోర్టు సంచలన నిర్ణయం
ఏపీలో ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎం ధ్వంసం చేసిన కేసులో మాచర్ల మాజీ ఎమ్మెల్యే గత కొద్దిరోజులుగా నెల్లూరు జైల్లో ఉన్నారు.
దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎం ధ్వంసం చేసిన కేసులో మాచర్ల మాజీ ఎమ్మెల్యే గత కొద్దిరోజులుగా నెల్లూరు జైల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణ మరోసారి వాయిదా పడినట్లు సమాచారం. నేడు (సోమవారం) పిన్నెల్లి బెయిల్ పిటిషన్‌పై హై కోర్టులో విచారణకు వచ్చింది. గతంలో ముందస్తు బెయిల్ పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి వద్దకే ఈ పిటిషన్ వెళ్లాలని హైకోర్టుకు పోలీసుల తరఫున న్యాయవాది అశ్వనీకుమార్ సూచించారు. ఈ క్రమంలో రోస్టర్ ప్రకారం ప్రజెంట్ ఉన్న కోర్టులోనే విచారించాలని పిన్నెల్లి తరఫున సీనియర్ న్యాయవాది వాదించారు. ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి ఇవన్నీ నిశితంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నారు. అనంతరం కేసు తదుపరి విచారణను హైకోర్టు ఈ నెల 14వ తేదీకి వాయిదా వేసినట్లు తెలుస్తోంది.