‘పవన్ కల్యాణ్ ఎందుకు పార్టీ పెట్టారో ఆయనకు కూడా తెలియదు’

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై మాజీ మంత్రి, ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ ఎందుకు పార్టీ పెట్టారో ఆయనకే తెలియదని విమర్శించారు.

Update: 2024-02-18 10:12 GMT

దిశ, వెబ్‌డెస్క్: జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై మాజీ మంత్రి, ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ ఎందుకు పార్టీ పెట్టారో ఆయనకే తెలియదని విమర్శించారు. పవర్ షేరింగ్ లేనప్పుడు పవన్‌కు పార్టీ ఎందుకని ప్రశ్నించారు. షేరింగ్‌ లేకపోతే జనసేనకు 50 సీట్లు ఇచ్చినా ఉపయోగం లేదని ఎద్దేవా చేశారు. అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు నేరుగా ఆయన టీడీపీ పార్టీలో చేరితే సరిపోతుందని చెప్పారు. ఎవరిని ఉద్దరించడానికి పార్టీ పెట్టారని పవన్ కల్యాణ్‌ను అవంతి ప్రశ్నించారు. మళ్లీ ఏపీలో వచ్చేది వైసీపీ ప్రభుత్వమే అని జోస్యం చెప్పారు.

ఎవరెన్ని కుట్రలు చేసినా జగన్ రెండోసారి ముఖ్యమంత్రి కాకుండా ఎవరూ ఆపలేరని అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని తట్టుకోలేక పూర్తిగా ఆంధ్రాను వదిలేసి చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ హైదరాబాద్‌లోనే ఉండిపోతారని అన్నారు. తాను సీటు మార్చేది లేదని మరోసారి స్పష్టం చేశారు. భీమిలి నుంచే పోటీ చేస్తానని చెప్పారు. ఆ నియోజకవర్గంలో తాను గెలవడం ఖాయమని తెలిపారు. గతంలో రెండు సార్లు కూడా భీమిలి నుంచే పోటీ చేశానని గుర్తుచేశారు. భీమిలీలో వైసీపీ జెండా ఎగరవేయడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News