500 మీటర్లు వెనక్కి వెళ్లిన సముద్రం.. విపత్తుకు సంకేతం అంటున్న మత్స్యకారులు

కాకినాడలోని ఉప్పాడ తీరంలో సముద్రం 500మీటర్ల మేర వెనక్కి వెళ్లిడంతో స్థానికులు, మత్స్యకారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

Update: 2024-09-10 05:49 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఉవ్వెత్తున అలలు ఎగసిపడుతూ ఉండే ఉప్పాడ తీరంలో సముద్రం ఉన్నట్లుండి 500 మీటర్ల మేర వెనక్కి వెళ్లింది. దీంతో స్థానికులు, మత్స్యకారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇది పెద్ద విపత్తుకు సంకేతమని చెబుతున్నారు. ఇదిలా ఉంటే వారం రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతుండడంతో అనేక ప్రాంతాలు నీటమునిగిన విషయం తెలిసిందే. కాకినాడలో కూడా అనేక ప్రాంతాలు నీటమునిగాయి. ఈ క్రమంలోనే ప్రభుత్వం అనేక సహాయక చర్యలు అందిస్తోంది.


Similar News