Breaking: శ్రీశైలం, ప్రకాశం బ్యారేజీల్లో సీ ప్లేన్స్.. వారం రోజుల్లోనే పాలసీ

రాష్ట్రంలో సీ ప్లేన్ పాలసీని తీసుకొచ్చేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది.,...

Update: 2024-08-17 10:31 GMT

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో సీ ప్లేన్ పాలసీని తీసుకొచ్చేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రాష్ట్రాభివృద్ధిపై ఫోకస్ పెట్టిన సీఎం చంద్రబాబు... ఎయిర్‌పోర్టుల విస్తరణతో పాటు సీ ప్లేన్ల ఏర్పాటుపై ఢిల్లీలో సివిల్ ఏవియేషన్ మంత్రి రామ్మోహన్ నాయుడుతో చర్చించారు. రాష్ట్రంలో సీ ప్లేన్ పాలసీని ఉపయోగించుకుంటామని మంత్రి దృష్టికి సీఎం తీసుకెళ్లారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన రామ్మోహన్ నాయుడు.. చంద్రబాబుతో భేటీలో చర్చించిన అంశాలపై ఆయన మీడియాతో మాట్లాడారు. శ్రీశైలం, ప్రకాశం బ్యారేజ్‌లో సీ ప్లేన్స్ ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు రామ్మోహన్ నాయుడు తెలిపారు. రాష్ట్రం నుంచి అన్ని విధాలుగా సహకరిస్తామని అటు సీఎం చంద్రబాబు కూడా హామీ ఇచ్చారని ఆయన తెలిపారు. ఏపీలో కొత్త ఎయిర్ పోర్టులు నిర్మించాల్సిన అవసరం ఉందని రామ్మోహన్ నాయుడు తెలిపారు. 

భోగాపురం ఎయిర్ పోర్టును 2026 జూన్ వరకూ పూర్తి చేస్తామని సివిల్ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. మిగిలిన విమానాశ్రయాల విస్తరణను సంవత్సరం లోపు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.. ఈస్ట్ కోస్ట్‌ లాజిస్టిక్ హబ్‌గా మారబోతోందన్నారు. సీఎం చంద్రబాబు చాలా దూరదృష్టితో ఆలోచిస్తున్నారని తెలిపారు. రిమోట్ ప్రాంతాలకు ఎయిర్ కనెక్టివిటీకి ప్రాధాన్యమిస్తున్నామని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.

Tags:    

Similar News