తిరుపతి లడ్డు వివాదంపై స్పందించిన రాహుల్ గాంధీ

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి ఉపయోగించి భక్తుల మనోభావాలను దెబ్బతీశారని ఆరోపించారు.

Update: 2024-09-20 15:12 GMT

దిశ, వెబ్‌డెస్క్: గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి ఉపయోగించి భక్తుల మనోభావాలను దెబ్బతీశారని సీఎం చంద్రబాబు ఆరోపించారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తిరుపతి వెంకటేశ్వర స్వామి భక్తులు ఒక్కసారిగా బగ్గుమన్నారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. స్వయంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ ఆరోపణలు చేయడంతో దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. దీంతో కాంగ్రెస్ ఎంపీ, పార్లమెంట్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు. ఈ ఇష్యూపై ట్విట్టర్ వేదికగా ఆయన స్పందింస్తూ.. "తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర ఆలయంలో ప్రసాదం అపవిత్రమైందన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. లార్డ్ బాలాజీ భారతదేశంలో, ప్రపంచ వ్యాప్తంగా మిలియన్ల మంది భక్తులకు గౌరవనీయమైన దేవుడు. ఈ సమస్య ప్రతి భక్తుడిని బాధపెడుతుంది. ఈ వ్యవహారంపై అధికారులు క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. భారతదేశంలోని అధికారులు మన మతపరమైన ప్రదేశాల పవిత్రతను కాపాడాలి." అని తన ట్వీట్‌లో రాసుకొచ్చాడు.


Similar News