Bribe Demand: తిరుపతి ఆర్డీవో నిశాంత్‌రెడ్డి సస్పెండ్

తిరుపతి ఆర్డీవో నిశాంత్‌రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. ..

Update: 2024-09-20 16:29 GMT

దిశ, వెబ్ డెస్క్: తిరుపతి ఆర్డీవో నిశాంత్‌రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. లంచం ఆరోపణలపై నిశాంత్‌ను సస్పెండ్ చేస్తూ రెవెన్యూ ప్రత్యేక కార్యదర్శి సిసోడియా ఆదేశాలు జారీ చేశారు. పుత్తూరులో పెట్రోల్ బంకుకు ఏన్ఓసీ ఇచ్చేందుకు రూ. లక్ష డిమాండ్ చేశారు. విచారణలో నిశాంత్‌రెడ్డి లంచం డిమాండ్ చేసినట్లు నిర్ధారణ అయింది. దీంతో ఆయనపై సిసోడియా సీరియస్ అయ్యారు. సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

కాగా చిత్తూరు జిల్లా పుత్తూరు సమీపంలో హెచ్ పీసీఎల్ పెట్రోల్ బంకు ఏర్పాటు చేసేందుకు అవసరమైన అనుమతులు కావాలని ఆర్డీవో నిశాంత్ రెడ్డిని యజమాని కోరారు.  అయితే  ఆయన రూ. లక్ష డిమాండ్ చేశారు.దీంతో సీసీఎల్ అధికారులకు బంక్ యజమాని ఫిర్యాదు చేశారు. ఈ మేరకు తిరుపతి జేసీ‌తో విచారణ చేయించారు. అయితే ఫిర్యాదును వాపస్ తీసుకోవాలని బాధుడిని ఆర్డీవో బెదిరించారు.  దీంతో మళ్లీ సీసీఎల్ఏకు బాధితుడు ఫిర్యాదు చేశారు. ఆర్దీవో నిశాంత్ రెడ్డితో పాటు ఆయనకు సహకరించిన మరో ఇద్దరిని విచారించారు. నిశాంత్ రెడ్డి లంచం డిమాండ్ చేసినట్లు తేలడంతో తాజాగా సస్పెండ్ చేశారు. 


Similar News