ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం.. స్కూళ్లు, కాలేజీల బంద్ ప్రశాంతం
విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సాగుతున్న ఉద్యమం బుధవారం వెయ్యి రోజులకు చేరుకుంది.
దిశ, వెబ్‌డెస్క్: విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సాగుతున్న ఉద్యమం బుధవారం వెయ్యి రోజులకు చేరుకుంది. పరిశ్రమను ప్రైవేటీకరిస్తే 18 వేల మంది శాశ్వత ఉద్యోగుల, 20 వేల మంది ఒప్పంద ఉద్యోగులు, భూనిర్వాసితుల పరిస్థితి ఏంటని ఉద్యమం కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో విద్యార్థి సంఘాల పిలుపు మేరకు స్కూళ్లు, కాలేజీల బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. చాలా ప్రాంతాల్లో విద్యాసంస్థలు ముందస్తుగా మూసి బంద్‌కు సంఘీభావం ప్రకటించాయి. కాగా నేడు (నవంబరు 08) విజయవాడలో ఎస్‌ఆర్ఆర్ కళాశాల వద్ద విద్యార్థి నేతలు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారీతీయడంతో పోలీసులు అక్కడకు చేరుకుని.. ధర్నాకు దిగిన నేతలను అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు.