AP News:గోదావరి నీరు పూర్తిగా తగ్గిన తర్వాతే ఇసుక తవ్వకాలు:కలెక్టర్

రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 15 తేదీ నుంచి పూర్తి స్థాయిలో ఇసుక ర్యాంపుల నుంచి తవ్వకాలు నిర్వహించాలన్న సూచనల మేరకు ఇసుక ర్యాంపులను పరిశీలించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ తెలిపారు.

Update: 2024-10-05 11:12 GMT

దిశ,అమలాపురం: రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 15 తేదీ నుంచి పూర్తి స్థాయిలో ఇసుక ర్యాంపుల నుంచి తవ్వకాలు నిర్వహించాలన్న సూచనల మేరకు ఇసుక ర్యాంపులను పరిశీలించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ తెలిపారు. శనివారం ఆలమూరు మండల పరిధిలోని ఆలమూరు గ్రామం ఇసుక ర్యాంపును, రావులపాలెం మండల పరిధిలోని పొడగట్లపల్లి ఒకటి రెండు ఇసుక రాంపులను ఆయన అధికారులతో కలిసి స్వయంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈనెల 15వ తేదీ నుంచి ఇసుక తవ్వకాల నిర్వహించేందుకు ఇసుక (రీచ్లు) ర్యాంపులలో ఇసుక తవ్వకాల నిర్వహించేందుకు అనువైన పరిస్థితులు ఉన్నది లేనిది, గోదావరి వరద నీరు తగ్గింది, లేనిది పరిశీలించడం జరుగుతోందని, ఇంకా ఇసుక రీచులలో గోదావరి వరద పూర్తిగా తగ్గలేదని నీరు తగ్గిన పిమ్మట ఇసుక ర్యాంపులలో తవ్వకాలకు చర్యలు చేపట్టాలని ఆయన సంబంధిత సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కొత్తపేట రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీకర్, గనులు భూగర్భ శాఖ రియాలిటీ ఇన్స్పెక్టర్ టి. సుజాత, రావులపాలెం రెవెన్యూ ఇన్స్పెక్టర్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.


Similar News