48లక్షల పెళ్లిళ్లు.. రూ.6 లక్షల కోట్ల ఖర్చు

దేశంలో రెండు నెలల విరామం తర్వాత నవంబర్ 12 నుంచి పెళ్లిళ్ల సీజన్ మొదలుకానుంది

Update: 2024-10-05 12:25 GMT

దిశ, వెబ్ డెస్క్ : దేశంలో రెండు నెలల విరామం తర్వాత  నవంబర్ 12 నుంచి పెళ్లిళ్ల సీజన్ మొదలుకానుంది. మనదేశంలో పెళ్లి వేడుకలు ఖర్చుతో కూడిన వ్యవహారంగా మారింది. 45రోజుల పాటు సాగే ఈ పెళ్లిళ్ల సీజన్ లో దేశవ్యాప్తంగా 48 లక్షల పెళ్లిళ్లు జరుగుతాయని అంచనా వేస్తున్నారు. ఇందుకోసం రూ.6 లక్షల కోట్లు ఖర్చు చేసేందుకు భారతీయులు సిద్ధం అవుతున్నారని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) సర్వే పేర్కొంది. ఒక్క ఢిల్లీలోనే 4.5 లక్షల పెళ్లిళ్ల ద్వారా రూ.1.5 లక్షల కోట్ల వ్యా పారం జరుగనుందని తెలిపింది. గత ఏడాది గత ఏడాది 2023 నవంబర్-డిసెంబర్ సీజన్‌లో 35 లక్షల పెళ్లిళ్లు జరగగా.. రూ.4.29 లక్షల కోట్ల వ్యాపారం జరిగినట్లు తెలిపింది. 2023లో ఈ రెండు నెలల కాలంలో 11 శుభ ముహూర్తాల్లోనే భారీ స్థాయిలో వివాహాలు జరిగాయి. ఈ ఏడాది 2024లో నవంబర్ 12నుంచి డిసెంబర్ 16వరకు 18 దివ్యమైన మూహుర్తాలున్నాయి. ముహూర్తాల సంఖ్య పెరిగిన నేపథ్యంలో వ్యాపారం సైతం భారీగా పెరిగుతుందని సీఏఐటీ అంచనా వేసింది.

పెళ్లిళ్ల సీజన్‌లో ప్రధానంగా వస్త్రాలు, ఆభరణాలు, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ల ఉపకరణాలు, డ్రై ఫ్రూట్స్, మిఠాయిలు, కిరాణా సరుకులు, కూరగాయలు వంటి వాటికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. అలాగే బాంక్వెట్ హాల్స్, హోటళ్లు, అతిథి గృహాలు, ఈవెంట్ మేనేజ్మెంట్, టెంట్ డెకరేషన్, క్యాటరింగ్, ఫ్లవర్ డెకరేషన్, రవాణా, క్యాబ్ సర్వీసులు, ఫోటో గ్రఫీ, వీడియో గ్రఫీ, ఆర్కెస్ట్రా, బ్యాండ్, లైటింగ్ వంటి వాటికి డిమాండ్ ఎక్కువ ఉంటుంది. ఈ ఏడాది నవంబర్ 12వ తేదీన ఏకాదశి నుంచి శుభముహూర్తాలు ప్రారంభమవుతున్నాయి. నవంబర్ నెలలో 12, 13, 17,18, 22, 23, 25,26,28,29 తేదీల్లో ముహూర్తాలు ఉన్నాయి. ఇక ఆ తర్వాత డిసెంబర్ నెలలో 4, 5, 9, 10, 11, 14, 15, 16 తేదీల్లో ముహూర్తాలు ఉన్నాయి. ఆ తర్వాత నెల రోజుల పాటు ఎలాంటి ముహూర్తాలు లేవు. మళ్లీ 2024 జనవరి రెండో వారం నుంచి శుభ ముహూర్తాలు మొదలై మార్చి, ఏప్రిల్ 26వరకు ముహూర్తాలు ఉన్నాయని పంచాంగకర్తలు చెబుతున్నారు.


Similar News