పవన్.. TDP ఉపాధ్యక్ష పదవి తీసుకో: జనసేనానిపై సజ్జల సెటైర్లు

టీడీపీ-జనసేన ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ టీడీపీ-జనసేన ఉమ్మడి తొలి జాబితాను విడుదల చేశారు.

Update: 2024-02-24 08:45 GMT

దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ-జనసేన ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ టీడీపీ-జనసేన ఉమ్మడి తొలి జాబితాను విడుదల చేశారు. మొత్తం 118 సీట్లకు అభ్యర్థులను ఖరారు చేయగా.. టీడీపీకి 94, జనసేనకు 24 స్థానాలు కేటాయించారు. కేవలం 24 సీట్లకే పవన్ కల్యాణ్ ఒప్పుకోవడంతో ఆయనపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇన్ని రోజులు పోరాటం చేసింది కేవలం ఆ 24 సీట్ల కోసమేనా అని జనసైనికులు సైతం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో పవన్ కల్యాణ్‌పై వైసీపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల ఫైర్ అయ్యారు. టీడీపీ-జనసేన ఉమ్మడ లిస్ట్‌పై ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ..

టీడీపీ-జనసేన పొత్తులో బలహీనత కనిపిస్తోంది.. పవన్‌ దయనీయంగా మారారని ఎద్దేవా చేశారు. జనసేనను మింగాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. పవన్ కల్యాణ్‌ను చూస్తే జాలేస్తోంది.. ఆయన అత్యంత దయనీయ స్థితిలో ఉన్నారన్నారు. గత ఎన్నికల్లో పవన్ పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయారు.. ఈ సారి ఎక్కడ పోటీ చేయాలో కూడా ఆయనకు క్లారిటీ లేదని ఎద్దేవా చేశారు. జనసేన టీడీపీ అనుబంధ విభాగంగా మారిందని.. టీడీపీకి పవన్‌ ఉపాధ్యక్షుడు అయితే బాగుంటుందని సెటైర్ వేశారు. జనసేన అభ్యర్థులను కూడా చంద్రబాబే డిసైడ్‌ చేస్తున్నారని.. జనసేన పోటీ చేసే 24 సీట్లలో కూడా టీడీపీ అభ్యర్థులే ఉంటారని ఆరోపించారు. రాజకీయ పార్టీని నడిపే లక్షణాలు పవన్‌కు లేవని విమర్శలు గుప్పించారు.

Read More..

దేశంలో మొట్టమొదటిసారిగా.. ఫస్ట్ లిస్ట్ ప్రకటన తర్వాత CBN ఆసక్తికర ట్వీట్  

Tags:    

Similar News