APSRTC యూనియన్ నేత మృతి.. పాడె మోసిన ఎండీ ద్వారకా తిరుమల రావు

ఏపీపీటీడీ ఎంప్లాయిస్ యూనిటీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వైవీ రావు అకాల మరణంపై ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు..

Update: 2023-02-18 14:42 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఏపీపీటీడీ ఎంప్లాయిస్ యూనిటీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వైవీ రావు అకాల మరణంపై ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణ వార్త తెలుసుకున్న ఎండీ హుటాహుటిన వైవీ రావు నివాసానికి వెళ్లారు. వైవీ రావు భౌతిక ఖాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఆ తర్వాత అంతిమ యాత్రలో స్వయంగా పాల్గొని తన భుజాలపై భౌతికకాయాన్ని మోసి కన్నీటి నివాళులు అర్పించారు.

ఆయన సేవలు మరువలేనివి...

వైవీ రావు మరణం నమ్మశక్యంగా లేదని, నిబద్ధత కలిగిన నాయకుడిగా ఆయన అందించిన సేవలు మరువలేనివని ఎండీ ద్వారకా తిరుమల రావు కొనియాడారు. స్నేహశీలి, మృధు స్వభావం కలిగిన వ్యక్తిగా, కార్మిక పక్షపాతిగా పేరు తెచ్చుకోవడమే కాకుండా చాకచక్యంగా డిమాండ్‌లను సాధించుకునే నేర్పరని అన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారం విషయంలో ఏ మాత్రం రాజీపడే వ్యక్తికాదని, మొండి పట్టుదలతో పోరాడేవారని తెలిపారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనమైన తర్వాత కూడా ప్రభుత్వ అధికారులతో కూడా చక్కని సాన్నిహిత్యం ఏర్పరచుకుని డిమాండ్ చేసిన కోరికలు సాధించడంలోనూ, పీఆర్సీ విషయంలోనూ ఇంకా అనేక ప్రయోజనాలు రాబట్టడంలోనూ ఎంతో చొరవ చూపారని...అలాంటి వ్యక్తి అకాల మరణం కలచి వేసిందని ఎండీ ద్వారకా తిరుమల రావు ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read...

Breaking: సీబీఐ విచారణకు మరోసారి కడప ఎంపీ అవినాశ్ రెడ్డి

Tags:    

Similar News