బాబు, భువనేశ్వరితో ఆర్జీవి కాఫీ కబుర్లు.. ఫ్యాన్ ఫీజ్ ఫట్టా..?

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ట్విటర్ (X) లో తన సతీమణి నారా భువనేశ్వరికి సంబంధించిన ఓ ట్వీట్ చేశారు.

Update: 2024-02-28 12:34 GMT

దిశ డైనమిక్ బ్యూరో: తెలుగుదేశం అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ట్విటర్ (X) లో తన సతీమణి నారా భువనేశ్వరికి సంబంధించిన ఓ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ లో అరకు లోయలో ఆదివాసులతో కలిసి కాఫీ తాగుతున్న ఫోటోను షేర్ చేస్తూ.. ఆ ఫోటోకి మన గిరిజన సోదర సోదరీమణులు ఉత్పత్తి చేసిన కాఫీ రుచి ఎలా ఉంది అనే క్యాప్షన్ జోడించి పోస్ట్ చేశారు.

అయితే ఆ పోస్ట్ ఆంగ్లంలో ఉంది. కాగా చంద్రబాబు ట్వీట్ కి సమాధానంగా భువనేశ్వరీ కూడా ఆంగ్లంలో రీట్వీట్ చేశారు. ఆమె చేసిన ట్వీట్ లో తనకు ఆ కాఫీ చాల బాగా నచ్చిందని.. తమ వంటగదిలో ఆ కాఫీ ప్యాకెట్లు చాలానే ఉన్నప్పటికీ, అరకు యొక్క అందాలు, అక్కడి వెచ్చదనం మధ్య ఆమె తాగుతున్న కాఫీ చాల రుచిగా అనిపించిందని పేర్కొన్నారు.

బహుశా దానికి కారణం తమ గిరిజన సోదరీమణులు, సోదరులు ఆ కాఫీ చెట్లను ప్రేమగా పెంచుకోవడంతో ఆ కాఫీకి అంత రుచి వచ్చి ఉంటుందని ఆమె భావిస్తున్నట్లు.. అలానే ఆ కాఫీని గ్లోబల్ బ్రాండ్ గా మార్చినదకు చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలియ చేశారు. కాగా ఇరువురు చేసుకున్న ట్వీట్లపై ఆర్జీవీ స్పందించారు.

వావ్.. కాఫీ కంటే మీ ఇద్దరి ఇంగ్లీష్ గొప్పగా ఉందని.. అయితే దయచేసి మీ ట్వీట్లు రాస్తున్న వ్యక్తిని తొలగించండి అని పేర్కొన్నారు. అలానే ఆ ట్వీట్లు రాస్తున్న వ్యక్తి లోకేష్ అని తాను అనుకుంటున్నట్లు తెలిపారు. అలానే మీరు తెలుగు ప్రజలకు తెలుగు నాయకులుగా ఉన్నప్పుడు మీరు ఎందుకు ఆంగ్లంలో ట్వీట్ చేస్తున్నారో తనకు అర్థం కాలేదన్నారు. హాస్యాస్పదంగా మీ ట్వీట్లను అర్థం చేసుకునే చివరి వ్యక్తులు మీ గిరిజన సోదరులు.. సోదరీమణులు అని ఎద్దేవ చేస్తూ ట్వీట్ చేశారు. 



Tags:    

Similar News