ఏపీ రాజకీయల్లో కొత్త ట్రెండ్.. చంద్రబాబుకు ఆర్జీవీ బేతాళ ప్రశ్న

ఆంద్రప్రదేశ్ రాజకీయాలు కాకపుట్టిస్తున్నాయి.

Update: 2024-02-17 10:09 GMT

దిశ డైనమిక్ బ్యూరో: ఆంద్రప్రదేశ్ రాజకీయాలు కాకపుట్టిస్తున్నాయి. పాలకపక్షానికి విపక్షాలకు మధ్య పచ్చ గడ్డి వేసిన బగ్గు మంటోంది. మొన్నటి వరకు ఫ్లెక్సీ లతో యుద్ధం చేసుకున్న నేతలు. ఇప్పుడు రూటు మార్చారు. మాటల తూటాలు పేల్చే నాయకులు ఇప్పుడు ఏకంగా మాస్ డైలాగులు చెప్తున్నారు. ఇటీవల విడుదలైన గుంటూరుకారం సినిమాలో ఆ కుర్చీ మడత పెట్టి అనే పాటకు డాన్సింగ్ క్వీన్ శ్రీలీల, మిల్క్ బాయ్ మహేష్ బాబు స్టెప్పులేశారు.

అయితే ప్రస్తుతం ఆ కుర్చీని మడతబెట్టి అనే డైలాగ్ అటు సాధారణ ప్రజల్లోనే కాదు ఇటు రాజకీయ నాయకుల్లోనూ వేగంగా దూసుకుపోతోంది. మొదటగా ఓ భహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ చొక్కా చేతులు మడతబెట్టాల్సిన సమయం వచ్చింది అని డైలాగ్ చెప్పారు. ఈ డైలాగ్ తో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కాయి.

ఇక తెలుగుదేశం అధినేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, మీరు చొక్కా చేతులు మడత పెడితే.. టీడీపీ కార్యకర్తలు, జన సైనికులు, ప్రజలు కుర్చీ మడత పెడతారు.. అప్పుడు జగన్ కి కుర్చీ ఉండదు అని జగన్ డైలాగ్ కి కౌంటర్ ఇచ్చారు. అయితే చంద్రబాబు వ్యాఖ్యలపై క్రెయేటివ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ స్పందిచారు.

కుర్చీ మడతబెట్టి.. అనే బూతుకు అర్ధం అసలు CBN కి తెలుసా అనేది నా బేతాళ ప్రశ్న? అని X వేదికగా పోస్ట్ చేశారు. అయితే ఈ పోస్ట్ చూసిన నెటిజన్స్ పలు రకాలుగా స్పందిస్తున్నారు. ఆర్జీవీ నువ్వు బూతుల గురించి మాట్లాడితే ఆ బూతే సిగ్గు పడుతుందని ఒకరు కామెంట్ చేస్తే.. ఇక్కడెవడో బూతు గురించి మాట్లాడుతున్నాడే అంటూ ఆర్జీవీ ఓ అమ్మాయి కాలుని పట్టుకుని ఉన్న ఫోటోను కామెంట్ లో పోస్ట్ చేశారు. ఇలా నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. 

Tags:    

Similar News