పవన్ కల్యాణ్ ర్యాలీకి ఆంక్షలు.. సెంట్రల్ జైలు వద్ద బాలకృష్ణ, లోకేశ్ వెయిటింగ్

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును ములాఖత్‌లో భాగంగా కలిసేందుకు నందమూరి బాలకృష్ణ, నారా లోకేశ్‌లు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు చేరుకున్నారు. ఈ ఇద్దరు నేతలు సెంట్రల్ జైలు ప్రధాన ద్వారం వద్ద వేచి చూస్తున్నారు.

Update: 2023-09-14 06:25 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును ములాఖత్‌లో భాగంగా కలిసేందుకు నందమూరి బాలకృష్ణ, నారా లోకేశ్‌లు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు చేరుకున్నారు. ఈ ఇద్దరు నేతలు సెంట్రల్ జైలు ప్రధాన ద్వారం వద్ద వేచి చూస్తున్నారు. జైలు లోపల తమ వ్యక్తిగత వివరాలను జైలు సిబ్బందికి అటు నందమూరి బాలకృష్ణ, ఇటు నారా లోకేశ్‌లు నమోదు చేశారు. అయితే ములాఖత్‌లో భాగంగా చంద్రబాబు నాయుడును పవన్ కల్యాణ్ కలవాల్సి ఉంది. ఇందులో భాగంగా రాజమహేంద్రవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్న పవన్ కల్యాణ్‌ అక్కడ నుంచి సెంట్రల్ జైలు వద్దకు ర్యాలీగా బయలు దేరారు. అయితే అందుకు పోలీసులు అనుమతి నిరాకరించారు. జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమలులో ఉందని కాబట్టి అనుమతి నిరాకరించారు.

కేవలం 5 వాహనాలకు మాత్రమే ర్యాలీకి పోలీసులు అనుమతించారు. అయితే అభిమానులు మాత్రం అందుకు ససేమిరా అంటున్నారు. దీంతో ఎయిర్ పోర్టు వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ సెంట్రల్ జైలు వద్దకు రావడం ఆలస్యంగా మారింది. దీంతో పవన్ కల్యాణ్ రాకకోసం సెంట్రల్ జైలు వద్ద అటు నందమూరి బాలకృష్ణ, ఇటు నారా లోకేశ్‌లు వెయిట్ చేస్తున్నారు. ఇకపోతే ఒకేసారి అటు నందమూరి బాలకృష్ణ, పవన్ కల్యాణ్, నారా లోకేశ్‌లు చంద్రబాబు నాయుడును ములాఖత్‌లో భేటీ కానున్న నేపథ్యంలో సెంట్రల్ జైలు వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహించారు. అటు జనసైనికులు ఇటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులను ఎవరినీ జైలు పరిసర ప్రాంతాల్లోకి రాకుండా పోలీసులు భారీగా మోహరించారు.

Read More:   ములాఖత్ మతలబు: చంద్రబాబుతో పవన్,లోకేశ్,బాలకృష్ణల భేటీ 

Tags:    

Similar News