స్కూళ్లకు రూ.100 కోట్ల నిధులు విడుదల చేసిన మంత్రి లోకేష్

వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ స్కూళ్లు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతుండేవి. దీంతో విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్లలో చదవాలంటేనే భయపడేవారు.

Update: 2024-10-18 13:55 GMT

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ స్కూళ్లు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతుండేవి. దీంతో విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్లలో చదవాలంటేనే భయపడేవారు. కనీస సౌకర్యాలు లేకపోవడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొనే వారు. ఈ క్రమంలో 2024-25 విద్యా సంవత్సరంలో ఎటువంటి ఇబ్బంది ఎదురుకాకుండా ఉండటానికి, రూ. 100 కోట్లను విడుదల చేసినట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ప్రభుత్వం ఈ రోజు విడుదల చేసిన వందకోట్లలో.. ఈ విద్యా సంవత్సరానికి 855 పీఎం శ్రీ స్కూళ్లకు రూ. 8.63 కోట్లు, కేజీబీవీ స్కూళ్లకు రూ. 35.16 కోట్లు, మండల రిసోర్స్ కేంద్రాలకు రూ. 8.82కోట్లు, అలాగే మిగిలిన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్కూళ్లకు రూ. 51.90 కోట్లు విడుదల చేశారు. కాగా ఈ 100 కోట్ల నిధులను ఆయా పాఠపాలలో సుద్దముక్కలు, డస్టర్స్, చార్టులు, విద్యా సామాగ్రి, రిజిస్టర్లు, రికార్డులు, క్రీడా సామగ్రి, ఇంటర్నెట్, తాగునీరు వంటి కనీస అవసరాలకు ఈ నిధులను వాడుకోవచ్చని మంత్రి నారా లోకేష్ తెలిపారు.


Similar News