Ap News: పీవీ సింధు ఆన్‌డ్యూటీ సౌకర్యం మరోసారి పొడిగింపు

ఒలింపిక్ పతక విజేత, బాడ్మింటర్ క్రీడాకారిణి పీవీ సింధు ఆన్‌డ్యూటీ సౌకర్యాన్ని ఏపీ ప్రభుత్వం మరో ఏడాది పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ...

Update: 2024-10-18 15:44 GMT

దిశ, వెబ్ డెస్క్: ఒలింపిక్ పతక విజేత, బాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు ఆన్‌డ్యూటీ సౌకర్యాన్ని ఏపీ ప్రభుత్వం మరో ఏడాది పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. డిప్యూటీ కలెక్టర్ హోదాలో ఉన్న ఆమె హైదరాబాద్‌లోని ఏపీ ఆధీనంలో ఉన్న లేక్ వ్యూ అతిథి గృహం ఓఎస్డీగా పని చేస్తున్నారు. అయితే పీవీ సింధు ఆన్‌డ్యూటీ సర్వీస్‌ను 2025 సెప్టెంబర్ 30 వరకూ పొడిగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అంతర్జాతీయ పోటీల్లో శిక్షణ తీసుకుంటున్నందు వల్ల ఆమెకు ఓడీ సౌకర్యం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

కాగా 2016 రియో ఒలింపిక్స్‌లో రజతం సాధించినందుకు గౌరవార్థం పీవీ సింధుకు ఆలిండియా ప్రభుత్వం గ్రూప్-1 సర్వీస్‌ను ప్రకటించింది. దీంతో పీవీ సింధుకు అప్పటి చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్ర సచివాలయంలో డిప్యూటీ కలెక్టర్‌గా బాధ్యతలు అప్పగించింది. అప్పటి నుంచి ఆమె ఆన్‌డ్యూటీ సౌకర్యాన్ని పొడిగిస్తూ ప్రభుత్వం వచ్చింది. ఇప్పటివరకూ పీవీ సింధుకు ఐదుసార్లు ఈ అవకాశం కల్పించింది. ఇప్పుడు మరోసారి ఆన్ డ్యూటీ సదుపాయం కొనసాగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వుల్లో పేర్కొంది. 


Similar News