హీరాగోల్డ్ కేసులో కీలక మలుపు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హీరాగోల్డ్ కేసులో నేడు కీలక మలుపు చోటు చేసుకుంది.

Update: 2024-10-18 14:47 GMT

దిశ, వెబ్ డెస్క్ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హీరాగోల్డ్ కేసులో నేడు కీలక మలుపు చోటు చేసుకుంది. హీరాగోల్డ్ సంస్థల ఎండీ నౌహీర్ షేక్ బెయిల్ ను శుక్రవారం సుప్రీంకోర్ట్ రద్దు చేసింది. 2019లో నౌహీర్ కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయగా.. నేడు ఆ బెయిల్ రద్దు చేస్తూ సుప్రీంకోర్ట్ జస్టిస్ జే.బీ. పార్ధివాలా ఉత్తర్వులు జారీ చేశారు. పలు రకాల స్కీంల పేరుతో హీరాగోల్డ్ సంస్థ ప్రజల వద్ద నుండి దాదాపు రూ.5 వేల కోట్ల డిపాజిట్లు సేకరించింది. ఈ డిపాజిట్లను తిరిగి చెల్లించక పోవడంతో డిపాజిట్ దారులు ఈడీకి ఫిర్యాదులు చేశారు. ఈ స్కాంలో నౌహీరను అరెస్ట్ చేయగా.. హైకోర్ట్ బెయిల్ మంజూరు చేసింది. కాగా బెయిల్ మంజూరు సమయంలో కంపెనీల చట్టం-2013 నిబంధనల ప్రకారం హీరాగోల్డ్ కేసు దర్యాప్తు చేయాలని అప్పట్లో ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. అప్పటినుండి పలుమార్లు నౌహీరకు చెందిన అనేక చోట్ల ఈడీ దాడులు చేసి, వందల కోట్ల ఆస్తులను అటాచ్ చేసింది. కాగా నేడు ఏకంగా బెయిల్ రద్దు చేస్తూ సర్వోన్నత న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది.    


Similar News