బాపట్ల జిల్లా వాసులకు గుడ్ న్యూస్.. మంత్రి గొట్టిపాటి కీలక ప్రకటన

బాపట్ల జిల్లా వాసులకు గుడ్ న్యూస్ లభించింది. టూరిజం(Tourism) పరంగా జిల్లాను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

Update: 2024-11-05 10:20 GMT

దిశ, వెబ్ డెస్క్: బాపట్ల జిల్లా(Bapatla District) వాసులకు గుడ్ న్యూస్ లభించింది. టూరిజం(Tourism) పరంగా జిల్లాను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ మేరకు మంత్రి గొట్టిపాటి రవి కుమార్(Minister Gottipati Ravi Kumar) కీలక ప్రకటన చేశారు. మరో మంత్రి కొలుసు పార్థసారథి(Minister Parthasarathy)తో కలిసి బాపట్ల జిల్లాలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా గొట్టిపాటి మాట్లాడుతూ బాపట్ల జిల్లాలో టూరిజాన్ని ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయం, ఆక్వారంగాలకు పెద్దపీట వేస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా రోడ్లపై పడిన గుంతలను నెలలోపు పూడ్చుతామని హామీ ఇచ్చారు. ఇందుకోసం ప్రభుత్వం రూ. 826 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. యుద్ధ ప్రాతిపదికన రోడ్లపై ఉన్న గుంతలను పూడ్చాలని అటు సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) సైతం ఆదేశాలు జారీ చేశారని చెప్పారు గత పాలకుల పుణ్యమా అని రాష్ట్రంలో ఏ రోడ్డు చూసినా గుంతలే దర్శనమిస్తున్నాయని మంత్రి గొట్టిపాటి రవి విమర్శించారు.

Tags:    

Similar News