తన మద్దతు ఎవరికో ఎట్టకేలకు చెప్పేసిన పవన్ కల్యాణ్ మాజీ భార్య.. సంచలనంగా ఇన్‌స్టా పోస్ట్
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓటింగ్ టెన్షన్ పెరిగిపోయింది.
దిశ, సినిమా: ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓటింగ్ టెన్షన్ పెరిగిపోయింది. దాదాపు రెండు నెలల పాటు తమ పార్టీ అధికారంలోకి వస్తే చేసే హామీల గురించి పెద్ద ఎత్తున ప్రచారాలు చేశారు. అధికార పార్టీ నాయకులు, ప్రతిపక్ష పార్టీ నేతలు పోటాపోటీగా ప్రజల్లోకి వెళ్లి జరిపిన ప్రచారాలకు ఈ రోజుతో ముగింపు పలికింది ఈసీ. రెండు తెలుగు రాష్ట్రాల్లో నేటితో ప్రచారం ముగించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే ఇప్పటి వరకు నేతల గొంతులతో మారుమోగిపోయిన మైకులు సైలెంట్ అయిపోయాయి. ఇక ఈ నెల 13వ తేదీన ఓటింగ్ జరగనున్న విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే.. ఏపీలో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌కు మద్దతు కూడా బాగా పెరుతోంది. బుల్లితెర దగ్గర నుంచి వెండితెర వరకు సపోర్ట్ భారీగా అందుతోంది. అంతే కాకుండా ఇప్పటికే కొంత మంది సెలబ్రెటీలు జనసేనాని కోసం ప్రచారాల్లో కూడా పాల్గొన్నారు. ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తాజాగా పెట్టిన పోస్ట్ సంచలనంగా మారింది. మొన్నటి వరకు పవన్‌కు వ్యతిరేకంగా రేణూ దేశాయ్ ఉన్నట్లు వార్తలు వైరల్ అయ్యాయి. కానీ నేటితో ఈ రూమర్స్‌కు పులిస్టాప్ పడింది.
ఆమె మద్దతు ఎవరికో చెప్పకనే చెప్పేసింది రేణు. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌కు తన మద్దతును తెలుపుతూ ‘వచ్చే ఎలక్షన్లకు (మే-13) సత్య ప్రసాద్ అన్న అఖండా మెజారిటీతో గెలవాలని నా బెస్ట్ విషెస్ తెలుపుతున్నాను’ అంటూ చెప్పుకొచ్చింది. దీంతో సోషల్ మీడియా ఒక్కసారిగా షేక్ అయింది. రేణు దేశాయ్ మద్దతు.. TDP కి అని ప్రకటించడంతో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఊపిరిపీల్చుకుంటున్నారు. అంతే కాకుండా ‘థాంక్యూ వదినమ్మా’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
Read More..
Pawan Kalyan: భార్యాబిడ్డల గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయిన పవన్‌కళ్యాణ్